Thursday, January 23, 2025

కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఖర్గే

- Advertisement -
- Advertisement -

Mallikarjun Kharge took charge as Congress president

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడిగా సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే బుధవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల ప్రాధికార సంస్థ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ధ్రువీకరణ పత్రాన్ని మల్లికార్జున్ ఖర్గేకు అందజేశారు. 24 ఏళ్లలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలి గాంధీయేతర వ్యక్తి. పార్టీ అధ్యక్ష పదవికి జరిగిన ప్రత్యక్ష పోల్‌లో తిరువనంతపురం ఎంపి శశిథరూర్‌పై కార్గే విజయం సాధించారు. పార్టీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు, మల్లికార్జున్ ఖర్గే రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. అనంతరం ఇందిరా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, జగ్జీవన్ రామ్ స్మారక చిహ్నాలను సందర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News