Wednesday, January 22, 2025

రాజ్యసభ ఛైర్మన్‌కు మల్లికార్జున్‌ ఖర్గే లేఖ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పార్లమెంటు భద్రతా ఉల్లంఘనపై రాజ్యసభ ఛైర్మన్‌కు గురువారం లేఖ రాశారు. పార్లమెంటులో భద్రతా వైఫల్యం అత్యంత కీలక మిషయమని తెలిపారు. ఇటీవల పార్లమెంటులో ఈ తరహా ఘటన ఎప్పుడూ జరగలేదన్నారు. ఇండియా కూటమి ఫ్లోర్ లీడర్లతో చర్చించానని వెల్లడించారు. భద్రతా వైఫల్యంపై రూల్ 267 కింద చర్చించాలని కోరారు. ఈ ఘటనపై రాజ్యసభలో హోంమంత్రి ప్రకటన చేయాలని ఖర్గే డిమాండ్ చేశారు. హోంమంత్రి ప్రకటన చేసేవరకు ఇతర అంశాలపై చర్చ చేపట్టవద్దని ఖర్గే డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News