Saturday, April 26, 2025

రాజీవ్ గాంధీ నిజమైన దేశ భక్తులు: ఖర్గే

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మాజీ ప్రధాని, కాంగ్రెస్ నాయకులు రాజీవ్ గాంధీ నిజమైన దేశభక్తులు, భారత్ ముద్దుబిడ్డ అని కాంగ్రెస్ పార్టీ ప్రశంసించింది. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే ఆయనకు నివాళులు అర్పించారు. ఇప్పటి భారత్‌కు నిజమైన మార్గదర్శి ఆయనే అని , ప్రపంచ స్థాయి నేతల సరసన ఆయన నిలిచారని ఖర్గే కొనియాడారు. డిజిటల్ ఇండియాకు ఆయన రూపశిల్పిగా ఉన్నారని, ప్రధానిగా ఆయన సారథ్యం ప్రపంచనేతల మన్ననలు పొందిందని తెలిపారు. ఆధునిక భారత నిర్మాణంలో రాజీవ్ సారధ్యం వినూత్న మార్పులతో సరైన దిశకు బీజం నాటిందని తెలిపారు. కోట్లాది మంది భారతీయులకు ఆయన స్ఫూర్తి ప్రదాత అయ్యారని , ఐటి పరిజ్ఞానపు ఇండియా ఆయన ఆలోచనల ఫలితమే అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News