Thursday, January 23, 2025

బీహార్‌లో గెలిస్తే దేశంలో గెలిచినట్లే: ఖర్గే

- Advertisement -
- Advertisement -

పాట్నా : విభేదాలు వీడితే, బీహార్‌లో గెలిస్తే మనం దేశంలో గెలుస్తామని కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే కాంగ్రెస్ కార్యకర్తలకు హితవు పలికారు. ఇక్కడి కాంగ్రెస్ కార్యాలయంలో ఖర్గే శుక్రవారం పార్టీ వర్కర్లు, నేతలనుద్ధేశించి మాట్లాడారు. పార్టీ కార్యకర్తలు , నేతలంతా కూడా వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం కావాలని ఆయన కోరారు. విభేదాలు వీడడమే పార్టీ పటిష్టతకు కీలక అంశం అన్నారు. లోక్‌సభ ఎన్నికలను సంఘటితంగా ఎందుర్కొంటే మనం గెలువగల్గుతామన్నారు.

అన్ని పార్టీలు కలిసికట్టుగా నిలిచేందుకు పార్టీ నేత రాహుల్ గాంధీ కీలకమైన తొలి చర్య తీసుకున్నారని,ఈ క్రమంలోనే పాట్నాలో ఇప్పుడు ప్రతిపక్ష ఐక్యతా సమావేశం జరుగుతోందన్నారు. బీహార్ ఎప్పుడూ కాంగ్రెస్ సిద్ధాంతాలకు అనుగుణంగానే ఉందని, ఇక ముందూ ఉంటుందని తెలిపారు. బీహార్‌లో మనం గెలిచేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని ఖర్గే స్పష్టం చేశారు. ఇక్కడి సదాఖత్ ఆశ్రమంలోని కాంగ్రెస్ కార్యాలయం దేశ చర్రితలో కీలక భూమిక వహించిందని, ఇక్కడి నుంచి ఎదిగిన నేతలు పలువురు ఆ తరువాత దేశ స్వాతంత్య్రోద్యమంలో పాలుపంచుకున్నారని కొనియాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News