Monday, January 20, 2025

మోడీ పాలనలో ప్రజాస్వామ్యం లేదు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ వైఖరిపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. మోడీ పాలనతో న్యాయశాస్త్ర నియమాలను తుంగలోకి తొక్కారని, ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని మండిపడ్డారు. అదానీ అంశంపై విపక్షాల ఆందోళనలతో సోమవారం పార్లమెంటు నభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడిన అనంతరం ఖర్గే పార్లమెంటు సమీపంలోని విజయ్ చౌక్ వద్ద విలేఖరులతో మాట్లాడారు. మోడీ ప్రభుత్వం దేశాన్ని నియంతృత్వ ధోరణితో నడిపిస్తోందని, పైగా ప్రభుత్వ పెద్దలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటారని ఎద్దేవా చేశారు. గౌతమ్ అదానీ స్టాక్స్ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ( జెపిసి) దర్యాప్తుకోసం తాము డిమాండ్ చేస్తున్నామని, అయితే తాము ఈ అంశాన్ని లేవనెత్తినప్పుడల్లా తమ మైకులు కట్ చేస్తున్నారని, దాంతో గందరగోళం నెలకొనడం, సభను వాయిదా వేయడం జరుగుతోందని ఆయన ఆరోపించారు.

దర్యాప్తు ఏజన్సీలను దుర్వినియోగం చేయడం ద్వారా అధికార పక్షం విపక్షాలను అణచి వేస్తోందని ఖర్గే అంటూ, వీళ్లు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుండం విడ్డూరంగా ఉందన్నారు. రాహుల్ గాఃధీ వ్యాఖ్యలను ఆయన గట్టిగా సమర్థిస్తూ బిజెపి పాలనలో దేశంలో స్వతంత్ర సంస్థలు అణచివేతకు గురవుతున్నాయని, ప్రజాసామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని అన్నారు. అంతకు ముందు పార్లమెంటు హౌస్‌నుంచి విజయ్ చౌక్ దాకా ఖర్గే నేతృత్వంలో విపక్ష సభ్యులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్‌తో పాటుగా బిఆర్‌ఎస్, ఆప్, వామపక్షాలు, ఇతర ప్రతిపక్షాలకు చెందిన సభ్యులు కూడా పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News