Monday, December 23, 2024

ఆర్‌ఎస్‌ఎస్‌పై ఖర్గే ఘాటు వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే సోమవారం రాజ్యసభలో రాష్ట్రీయ స్వీయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్)పై చేసిన కొన్ని వ్యాఖ్యల పట్ల రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖర్ అభ్యంతరం తెలియచేస్తూ వాటిని రికార్డుల నుంచి తొలగించారు. పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతున్న సందర్భంగా ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. ఖర్గే ప్రసంగానికి ధన్‌ఖర్ అడ్డుతగులుతూ ఆర్‌ఎస్‌ఎస్ దేశం కోసం పనిచేసిందని, ఆర్‌ఎస్‌ఎస్ విద్యావేత్తకు అనుబంధం ఉంటే తప్పేమీ లేదని వ్యాఖ్యానించారు. ఖర్గే ప్రసంగిస్తుండగా రాజ్యసభ నాయకుడైన బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా మూడుసార్లు అడ్డుతగిలారు. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాల గురించి ఖర్గేకు ఏమీ తెలియదని ఆయన ప్రసంగం ద్వారా అర్థమవుతోందని నడ్డా అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ గురించి ఖర్గే చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని ఆయన చైర్మన్‌ను కోరారు.

నడ్డాకు హామీ ఇచ్చిన చైర్మన్ ఇప్పటికే అవసరమైన ఆదేశాలు ఇచ్చానని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ మతపరమైన ఉపన్యాసాలు చేశారని, కాంగ్రెస్ మేనిఫెస్టోపై దురుద్దేశాలు ఆపాదించారని ఖర్గే ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ చేసిన విద్వేష ప్రసంగాల గురంచి విదేశీ మీడియాలో వచ్చిన వార్తలను ఆయన ఉటంకిస్తూ మోడీ మద్దతుదారులు ఆయనను విశ్వగురుగా పిలవడానికి ఇష్టపడతారని, కాని వాస్తవానికి మోడీ దేశానికి చెడ్డపేరు తెస్తున్నారని ఖర్గే ఆరోపించారు. పార్లమెంట్ ప్రాంగణం నుంచి జాతీయ నాయకుల విగ్రహాలను తొలగించడంపై కూడా ఖర్గే అభ్యంతరం తెలియచేశారు. మహహాత్మా గాంధీ విగ్రహం కింద ప్రతిపక్షాలు నిరసన తెఇయచేయకూడదన్న ఉద్దేశంతోనే ఆయన విగ్రహాన్ని ప్రభుత్వం అక్కడి నుంచి తరలించిందని ఖర్గే ఆరోపించారు. గాంధీ విగ్రమంతోపాటు బిఆర్ అంబేద్కర్‌తో సహా పలువురు ప్రముఖుల విగ్రహాలను ప్రభుత్వం తొలగించిందని ఆయన ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News