Sunday, December 22, 2024

జనభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : హైదరాబాద్ గ్లోబల్ సిటీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధు లు ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి , తెలంగాణ ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. బొగ్గు వేలంపై బీఆర్‌ఎస్ నేతలు మొ స లి కన్నీరు కారుస్తున్నారని, వారి వల్లే బొగ్గు వే లం చట్టం వచ్చిందని చె ప్పారు. బొగ్గు వేలం ఆ పితే ఇల్లందు, సత్తుపల్లి గనులు ఎందుకు పో యాయని ప్రశ్నించారు. సింగరేణికి నష్టం జరిగేలా తమ సొంత వారికీ గనులు వచ్చేలా బీఆర్‌ఎస్ అధిష్ఠానం వ్యవహరించిందని ధ్వజమెత్తారు. అంతర్గత వనరులు సమీకరించుకుని తా ము రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. శనివారం న్యూఢిల్లీలోని భారత్ మండపంలో కేం ద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అ ధ్యక్షతన జరిగిన కేంద్ర బడ్జెట్ సన్నాహాక సమావేశంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి వి క్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ కేంద్ర ప్రాయోజిత పథకాల్లో కొంత వెసులుబాటు కల్పించాలని కోరారు. ఆ యా రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా నిధు లు ఉపయోగించుకునే అవకాశం ఇవ్వాలన్నా రు.

స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు బ డ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. సమాజంలో అసమానతలు తగ్గించేందుకు సమ్మిళిత అభివృద్ధి చేయాలని కోరారు. సెస్, సర్ ఛార్జ్ పన్నులు పది శాతం మించకుండా చేయాలన్నారు. రాష్ట్రాల నికర రుణపరిమితి సీలింగ్ ముందుగానే చెపితే దానికి అనుగుణంగా బడ్జెట్ పెట్టుకుంటామని స్పష్టం చేశారు. జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు ఉండాలని కోరారు. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద గత ఏడాది తెలంగాణకు 1.4 శాతమే నిధులు వచ్చాయని తెలిపారు. ఉపాధి హామీ నిధులు ఆస్తుల సృష్టి పనులకు వినియోగించేలా అనుమతులు ఇవ్వాలని కోరారు. మూసీ రివర్ ఫ్రంట్‌కు నిధులు కేటాయించాలని కోరామని భట్టి విక్రమార్క అన్నారు.

ద్రవ్యోల్బణం తో పాటు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలపై సూచనలు
రాష్ట్రాల మూలధన వ్యయానికి ప్రత్యేక ఆర్ధిక సహాయం పథకాన్ని సంవత్సరానికి రూ. 2.5 లక్షల కోట్లకు పెంచి పథకాన్ని కొనసాగించాలని, ఈ పథకంలో కేంద్ర ప్రాయోజిత పథకాలకు బ్రాండింగ్ వంటి షరతులు, ఇతర పరిమితులు లేకుండా నిధులను విడుదల చేయాలన్నారు. వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాలను పున: సమీక్షించి, అనవసరమైన పథకాలను తొలగించి, ఆప్షనల్‌గా కొత్త పథకాలను ప్రవేశపెట్టాలన్నారు. దేశం ఎదుర్కొంటున్న అత్యవసర సవాళ్లలో పెరుగుతున్న నిరుద్యోగం మరియు ఆదాయ పంపిణీలో అసమానతలు ప్రధానమైనవి. ఈ బడ్జెట్‌లో ఈ రెండు సమస్యలపై కొత్త పథకాలను ప్రవేశపెట్టి వాటికి ఎక్కువ నిధులను కేటాయించాలని కోరారు. భారత యువత నైపుణ్య స్థాయి నిరుద్యోగంతో సంబంధం ఉన్న ప్రధాన సమస్య.

వారికీ ఉద్యోగ అవకాశాలు అందించడానికి నూతన నైపుణ్యాలలో శిక్షణ,నైపుణ్యాలను మెరుగుపరచడం అవసరం. రాష్ట్రాలలో ఉన్న పారిశ్రామిక శిక్షణ సంస్థలను ప్రత్యేక ఆర్థిక సహాయంతో ఆధునీకరించాలన్నారు. రాష్ట్రాలకు ఆర్థిక సంఘాల సిఫార్సుల ప్రకారం పన్ను విభజనలో వారి వాటా తగ్గింది. సెస్‌లు, సర్ ఛార్జీల ద్వారా సేకరించిన మొత్తం పెరగడం వల్ల రాజ్యాంగ సంస్థల సిఫార్సులు మాత్రమే కాకుండా రాష్ట్రాల ప్రయోజనాలను కూడా ప్రభావితం చేసింది. అందుకని, మొత్తం పన్ను ఆదాయానికి శాతం గాను సెస్‌లు, సర్ ఛార్జీల వాటా 10 శాతం మించకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని, బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలోనే రాష్ట్రాలకు నికర రుణ పరిమితిని సీలింగ్‌ని తెలియజేయాలి, తద్వారా రాష్ట్రాలు అభివృద్ధి కార్యక్రమాలపై తమ వనరులను సమర్థవంతంగా ఖర్చు చేసేలా ప్రణాళికలు రూపొందించుకోగలుగుతాయన్నారు.

తెలంగాణ రాష్రానికి సంబంధించిన అంశాలు…
తెలంగాణ రాష్ట్రం,అనేక రంగాలలో గొప్ప పురోగతిని సాధించడంతో పాటు, జాతీయ ఆర్థిక వ్యవస్థకు విలువైన భాగస్వామిగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో తక్షణమే పరిష్కారం అవసరమైన సమస్యలను ఎదుర్కొంటోంది. ఇతర రాష్ట్రాల మాదిరిగా, మా రాష్ట్రం రెండు ప్రధాన సమస్యలను ఎదుర్కొంటోంది: కేంద్ర ప్రాయోజిత పథకాల (సిఎస్‌ఎస్) కింద విడుదలయ్యే నిధుల తగ్గింపు , కేంద్ర పన్నుల వాటాను పంచుకునే ఆర్థిక సంఘం సూత్రం. కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను అన్ని రాష్ట్రాలకు జనాభా నిష్పత్తి ప్రకారం విడుదల చేయాలి, ఏకపక్షంగా లేదా కొన్ని రాష్ట్రాలపట్ల ఎటువంటి పక్షపాతం లేకుండా చూడాలి. మన తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుంటే, 2023-24లో కేంద్ర ప్రాయోజిత పథకాల కింద విడుదల చేసిన మొత్తం రూ.4,60,000 కోట్లలో తెలంగాణ రాష్ట్రానికి కేవలం రూ.6577 కోట్లు మాత్రమే వచ్చింది, అంటే 1.4%. ఇది జనాభా నిష్పత్తి (లేదా ఏ ఇతర అంగీకరించిన మార్గం) ప్రకారం తక్కువగా ఉంది.

అందువల్ల, సిఎస్‌ఎస్ కేటాయింపులు జనాభా నిష్పత్తి ప్రకారం నిర్ణీత సమయంలో చేయాలన్నారు. ఏపీ పునర్విభజన చట్టం- 2014 ప్రకారం సెక్షన్ 94(2) కింద, రాష్ట్రానికి ప్రతి సంవత్సరం రూ.450 కోట్లను ఇవ్వాలని సూచించారు. అయితే రూ.2250 కోట్లు ఇంకా విడుదల కాలేదు. అందువల్ల, రూ.2250 కోట్లు విడుదల చేయడంతో పాటు ఆర్థిక మంత్రిత్వ శాఖ హైదరాబాద్ మినహా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలను వెనుకబడినవిగా ప్రకటించిన నేపధ్యంలో ఈ గ్రాంటును వచ్చే ఐదు సంవత్సరాల పాటు పొడిగించాలని కోరారు. రాష్ట్రం ఏర్పాటైన మొదటి సంవత్సరంలో, తెలంగాణ కోసం మంజూరైన రూ.495.21 కోట్ల సిఎస్‌ఎస్ గ్రాంట్లు యూనియన్ మంత్రిత్వ శాఖ ద్వారా పొరపాటుగా ఆంధ్రప్రదేశ్‌కు విడుదల చేయబడ్డాయి. ఈ మొత్తం కేంద్రం ద్వారా తిరిగి ఇవ్వాలని కోరారు. ఎంజిఎన్‌ఆర్‌ఈజిఏ కింద నిధుల వినియోగంపై రాష్ట్రాలపై విధించిన పరిమితులను ఆ పనులు ఉపాధి సృష్టించేవయితే ఆ పనులకు పరిమితులను తొలగించాలని విజ్ఞప్తి చేశారు.

నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లిన మరిన్ని అంశాలు….
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలి. కేంద్ర ప్రభుత్వం మూసి రివర్ డెవలప్మెంట్ కోసం అధిక నిధులు కేటాయించాలని, ఏజెన్సీల నుండి నిధుల సేకరించడానికి పీపీఆర్‌లు సమర్పించామన్నారు. రీజనల్ రింగ్ రోడ్ పూర్తి చేసేందుకు నిధులు కేటాయించి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని, తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని నవోదయ పాఠశాలలను కేటాయించాలని సూచించారు. ప్రధాని సూర్యఘర్‌లో విద్యుత్ సబ్సిడీ – ముఫ్తీ బిజిలీ యోజన పథకం కింద తెలంగాణా రాష్ట్రం సబ్సిడీ నిధులను రూటింగ్ చేయడానికి కేంద్రం సహకరించాలని, ఇది జరిగితే, రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి భారాన్ని తగ్గించడం వంటి చర్యలు తీసుకోవచ్చన్నారు. ఇవే కాకుండా ఇతర ప్రాజెక్టులకు కేంద్ర సహకారాన్ని కోరుతూ ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకు వెళ్లామని చెప్పారు.

జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో మల్లు భట్టి విక్రమార్క ప్రస్తావించిన అంశాలు…
1. ప్రభుత్వ పాఠశాలల నిర్మాణంపై జీఎస్‌టీ మినహాయింపు : ఉపముఖ్యమంత్రి ప్రభుత్వ పాఠశాలల నిర్మాణంపై జీఎస్‌టీ ని మినహాయించాలని కౌన్సిల్‌ను గట్టిగా కోరారు. ఇటువంటి మినహాయింపులు రాష్ట్రాలు అదనపు పాఠశాలలను నిర్మించడానికి మరిన్ని వనరులను కేటాయించగలవని, విద్యపై ప్రతి పౌరుని ప్రాథమిక హక్కును బలోపేతం చేయడానికి వీలు కల్పిస్తుందని ఆయన చెప్పారు.
2. అదనపు న్యూట్రల్ ఆల్కహాల్ , జీఎస్‌టీ : అదనపు ఆల్కహాల్‌ని జీఎస్‌టీ పరిధి నుండి మినహాయించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కోరారు. ఈఎన్‌ఏను జిఎస్‌టి కింద చేర్చడం వల్ల రాష్ట్రాల ఆర్థిక సౌలభ్యం తగ్గుతుందని, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే వస్తువులపై పన్ను భారం పెరుగుతుందని ఆయన వాదించారు. అందువల్ల వారు ఈఎన్‌ఏకి సంబంధించిన చట్ట సవరణ ప్రతిపాదనకు మద్దతు ఇచ్చా రు.

3. పన్ను, జరిమానా మరియు వడ్డీ మినహాయింపు : అవగాహనా లేమి వల్ల ఆలస్యంగా పన్ను చెల్లించిన వారిపై విధించిన పన్ను, జరిమానా వడ్డీని కొన్ని షరతులకు లోబడి, మినహాయించే ప్రతిపాదనపై కౌన్సిల్ చర్చించి మద్దతు ఇచ్చింది.
4. రేట్ రేషనలైజేషన్ కమిటీ నివేదిక : ఉప ముఖ్యమంత్రి కూడా రేట్ల హేతుబద్ధీకరణ కమిటీ ద్వారా నివేదికను త్వరగా సమర్పించాలనే అభ్యర్థనకు మద్దతు ఇచ్చారు. నివేదిక జీఎస్‌టీ రేట్ స్ట్రక్చర్‌ను మరింత సరళీకృతం చేసి, మరింత సులువుగా పాటించేలా చేస్తుందని ఆయన అన్నారు.

ఆర్థిక సవాళ్లను అధిగమిస్తాం : ఎపి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్
విభజన వల్ల వచ్చిన ఆర్థిక సవాళ్లను అధిగమించడానికి, గడిచిన 5 ఏళ్ల లో ఆర్ధిక పరమైన తప్పులను సరిదిద్దాడానికి కేంద్ర సహకారం కావాలని కోరానని ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. రాష్ట్రానికి ఏం కావాలి అనే అంశంపై కేంద్రానికి నివేదిక అందజేశానని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి కావడానికి సహకారం అందించాలని కోరామన్నారు. కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మల సీతారామన్ నేతృత్వంలో ఈరోజు(శనివారం) జరిగిన ఫ్రీ బడ్జెట్, జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాల్లో పయ్యావుల పాల్గొన్నారు. ఈ సందర్భంగా పయ్యావుల మాట్లాడుతూ అమరావతి నిర్మాణానికి సహకారం, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. పారిశ్రామిక రాయితీలు, పారిశ్రమిక కారిడార్ల ఏర్పాటుకు సహకారం ఇవ్వాలని, ఆక్వా పార్కులు,టెక్స్ టైల్ పార్కులు, గ్రీన్ ఎనర్జీ కారిడార్ కు మద్దతు కావాలని కోరామన్నారు. తిరుపతి వైజాగ్ ఎయిర్ పోర్ట్‌లకు రావాల్సిన రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలని కోరామన్నారు. ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సహకారం అందించాలని కోరామన్నారు. రైల్వే జోన్ ఆపరేషన్‌కు సహకారం ఇవ్వాలన్నారు.

రైల్వే జోన్ ఆపరేషన్ కు సహకారం అందించాలన్నారు. గ్రేహౌండ్స్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు సహకారమంది చాలన్నారు. కానీ కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటి కోసం కృషి చేస్తామని తెలిపారు. చేనేత వస్త్రాలపై 5 శాతం పన్ను మినహాయింపు కోరినట్లు చెప్పారు. కూరగాయలు, పండ్ల ప్యాకింగ్ కర్టన్లపై పన్ను తగ్గించారని మండిపడ్డారు. ఎరువులపై పన్ను తగ్గింపును జీవోఎంకి రీఫర్ చేశారని చెప్పారు. సమస్యలు తగ్గించేలా చాలా అంశాలపై జీఎస్టీ మండలిలో నిర్ణయాలు జరిగాయని చెప్పారు. కేంద్ర బడ్జెట్‌తో సంబంధం లేకుండా రాష్ట్ర బడ్జెట్ ఉంటుందని స్పష్టం చేశారు. అన్ని మంత్రిత్వ శాఖల నుంచి వివరాలు సేకరించి కేంద్ర బడ్జెట్ సన్నాహక సమావేశంలో ప్రస్తావించామని చెప్పారు. గాడి తప్పిన రాష్ట్రాన్ని నిలబెట్టాలి.పరుగులు పెట్టించాలి అన్నది చంద్రబాబు ఆలోచన అని, అది నమ్మారు కాబట్టే ప్రజలు తమకు అధికారం ఇచ్చారని ఉద్ఘాటించారు. 100 కి 93 శాతం రిజల్ట్ ఇచ్చారని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని అంచనా వేయడానికి సమయం పడుతుందన్నారు. కొందరు కార్యదర్శుల పదవీకాలం ముగిసిందని చెప్పారు. ప్రజల రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి తెలుసుకోవడానికి ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఇచ్చిన హామీలు అన్ని అమలు చేస్తాం…అనుమానం అవసరం లేదని పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News