- Advertisement -
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో ఎంపి టికెట్ల కోసం నేతలు పార్టీ ఆఫీసులకు క్యూ కడుతున్నారు. తెలంగాణ డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని ఖమ్మం నుంచి 500 కార్లతో గాంధీ భవన్‌కు బయలుదేరారు. భట్టి సతీమణి నందిని కాంగ్రెస్ ఎంపి సీటుకోసం శనివారం గాంధీ భవన్ లో దరఖాస్తు చేయనున్నారు. ఖమ్మం నుంచి సోనియా లేదా ప్రియాంక పోటీ చేయాలి… ఇద్దరిలో ఎవరు పోటీ చేసినా గెలిపించుకుంటాం.. అధిష్ఠానం ఛాన్స్ ఇస్తే.. ఖమ్మం నుంచి పోటీ చేస్తానన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్నదే తన లక్ష్యమని మల్లు నందిని వెల్లడించారు.
- Advertisement -