Monday, December 23, 2024

కాంగ్రెస్ స్ట్రాటజీని దొంగిలించారు: మల్లు రవి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ పై పోలీసులు దాడి చేసి కంప్యూటర్లు, సమాచారాన్ని ప్రభుత్వం దొంగిలించిందని, కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కొనుగోలు ప్రణాళికను దొంగిలించారని పిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి విమర్శించారు. రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కి ప్రజలు అనుకూలంగా ఉన్నారని కాంగ్రెస్ ఏ రకమైన వ్యూహంతో ఉందొ, ఎలాంటి పథకాలు అమలు చేయాలని చూస్తుందో తెలుసుకొని వాటికి కొల్లగొట్టేందుకు ప్రభుత్వం ఒక కుట్ర పూరితంగా వ్యవహరించిందని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ రూపొందించిన ప్రణాళికలకు ప్రత్యామ్నాయంగా వ్యవస్థ రూపొందించేందుకు బిఆర్‌ఎస్ ప్రయత్నం చేస్తుందని అన్నారు. ఇది ప్రభుత్వం చేసిన సైబర్ క్రైమ్ అని దీనిని ప్రజలు గమనించాలని అన్నారు. దొంగతనం చేసిన ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News