Sunday, December 22, 2024

జోడో యాత్రను తెలంగాణ సమాజం విజయవంతం చేసిింది: మల్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ భారత్ జోడో యాత్రను తెలంగాణ సమాజం విజయవంతం చేసినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ ఎంపి మల్లు రవి కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం ఆయన గాంధీ భవన్ నుంచి మాట్లాడారు. దేశ ప్రజల స్వాతంత్ర్యన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకే రాహుల్ ఈ యాత్ర చేపట్టారన్నారు. దేశంలో ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా, రాజ్యాంగ బద్ధ పాలన సాగడం లేదని మల్లు విమర్శించారు. తెలంగాణలో పాదయాత్ర సాగుతున్న సమయంలో రైతులు, చేనేత, కళాకారులు, మేధావులు, సామాజికవేత్తలు ఇలా అన్ని వర్గాల వారితో రాహుల్ మాట్లాడి వాళ్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారన్నారు.

తెలంగాణ ప్రజలు అత్యంత చైతన్యవంతులని, పోరాట పటిమ కలవారని, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏకతాటిపైకి వచ్చి జోడో యాత్రను సఫలీకృతం చేశారని మల్లు రవి ప్రశంసించారు. ప్రజలకు అన్యాయం జరిగితే పోరాటం చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని, అధికారంతో సంబంధం లేకుండా మోడీ సర్కార్ తో ప్రజల పక్షాన కొట్లాడుతున్నామని, దేశ ప్రజలు కోల్పోయిన స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాన్ని మళ్లీ తిరిగి తెచ్చేందుకే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యక్తిగా కాకుండా భారత జాతీయ నాయకునిగా రాహుల్ ని గుర్తించేందుకు పాదయాత్రకు శ్రీకారంచుట్టారన్నారు. మునుగోడులో 3వ స్థానంలో ఉన్నంత మాత్రాన పార్టీ పనైపోయిందనుకుంటే పొరపాటన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News