Wednesday, January 15, 2025

ఢిల్లీలో రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి పదవికి మల్లు రవి రాజీనామా

- Advertisement -
- Advertisement -

రాజీనామా లేఖ సిఎంకు పంపించా
నాగర్ కర్నూలు లోక్‌సభ సీటు కోసం మల్లు డిమాండ్

మనతెలంగాణ/హైదరాబాద్:  పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీలో రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి పదవికి మల్లు రవి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సిఎం రేవంత్ రెడ్డికి పంపించారు. నాగర్ కర్నూలు లోక్‌సభ సీటు ఆశిస్తున్న మల్లు రవి ఆ టికెట్ కోసమే పదవి వదులుకున్నట్లుగా తెలుస్తోంది. కాగా, గత జనవరి 28న ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మల్లు రవి తన పదవికి రాజీనామా చేయడం ఆ పార్టీలో హాట్ టాఫిక్గా మారింది. నాగర్ కర్నూలు ఎంపి టికెట్ కోసం అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్, మల్లు రవి మధ్యల పోటీ ఉంది. కాగా ఇప్పటికే మహబూబ్ నగర్ ఎంపి అభ్యర్థిగా వంశీచంద్ రెడ్డి పేరును సిఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
వారం రోజుల క్రితమే సిఎంకు రాజీనామా లేఖను పంపించా
ఆయన శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్జర్లలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వారం రోజుల క్రితమే సిఎం రేవంత్ రెడ్డికి రాజీనామా లేఖను పంపినట్లు ఆయన వివరించారు. నాగర్ కర్నూల్ లోక్‌సభ నుంచి పోటీ చేస్తానని ఆయన మరోసారి స్పష్టం చేశారు. నా ఫస్ట్ ప్రయారిటీ ఎంపీగా పోటీ చేయడమేనని ఆయన తెలిపారు. తాను పోటీ చేయడానికి ఉదయపూర్ డిక్లరేషన్ అడ్డు అని పార్టీలో చర్చ జరుగుతుందని అందుకే రాజీనామా చేశానన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజీనామా పత్రాన్ని ఇచ్చానని ఆయన ఆమోదిస్తారా, లేదా ? అనేది ఆయన నిర్ణయానికి వదిలేస్తానన్నారు.

నాగర్ కర్నూల్ ఎంపి టికెట్ ఇవ్వడానికి ఆ పదవి అడ్డంకిగా ఉంటుందన్న అభిప్రాయంతోనే రాజీనామా చేశానన్నారు. నాగర్ కర్నూల్ ఎంపి స్థానం కోసమే జడ్చర్ల అసెంబ్లీ టికెట్ వదులుకున్నానని ఆయన తెలిపారు. ఏ సర్వేలు చేసిన నాగర్ కర్నూల్ ఎంపిగా తానే గెలుస్తానని చెబుతున్నాయన్నారు. నాగర్ కర్నూల్ టికెట్ తనకు ఇవ్వని పక్షంలో టికెట్ ఎందుకు నిరాకరిస్తున్నారో ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలన్నారు. ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం జోడు పదవులు ఉండవద్దని అందుకే రాజీనామా చేశానన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మద్దతు తనకు సంపూర్ణంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయసాయి రెడ్డి ఎంపిగా ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా జోడు పదవులు నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News