Tuesday, January 21, 2025

హిట్లర్ క్యాబినెట్‌లో గోబెల్..మోడీ క్యాబినెట్‌లో కిషన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

కేంద్ర మంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత, నాగర్ కర్నూల్ ఎంపి అభ్యర్థి మల్లు రవి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కిషన్ రెడ్డి సోది చెప్పే స్థాయికి వెళ్లారని విమర్శించారు. హిట్లర్ కేబినెట్లో గోబెల్ ఉన్నట్లే, మోడీ కేబినెట్లో కిషన్ రెడ్డి ఉన్నారని దుయ్యబట్టారు. రోజూ మోడీ చెప్పే అబద్ధాలనే కిషన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆగస్టు 15లోపే రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ చెప్పారని గుర్తుచేశారు. దానికి కట్టుబడి ఉన్నట్లు కూడా చెప్పారని, తమపై రైతులకు నమ్మకం ఉందని అన్నారు.

తమకే కాదు, బిజెపి నాయకులకు కూడా ఉందని, అందుకే ఎక్కడ చేస్తామో అనే భయంతో రుణ మాఫీ చేయరు, చేయలేరు అంటూ విమర్శనాత్మక ధోరణితో మాట్లాడుతున్నారని అన్నారు. ఇప్పటికే ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్న సంగతి బీజేపీకి తెలియదా? అని ప్రశ్నించారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతోందని జోస్యం చెప్పారు. మరోసారి బీజేపీ నేతలు సీఎం రేవంత్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తే బిజెపి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ హవా కొనసాగుతోందని, రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు దేశం మొత్తం సిద్ధంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News