Wednesday, November 13, 2024

అరుణతారకు అంతిమ వీడ్కోలు

- Advertisement -
- Advertisement -

Mallu Swarajyam Funeral is over

మన తెలంగాణ/నల్లగొండ రూరల్ : సిపిఎం కేంద్ర కమిటి సభ్యురాలు, వీరనారి, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం అంతిమయాత్ర ఆదివారం మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, వామపక్ష నేతలు, అభిమానుల మధ్య జరిగింది. భారీ సంఖ్యలో తరలివచ్చిన వివిధ పార్టీల నాయకులు నడుమ అంతిమ యాత్ర సాగింది. స్వరాజ్యం పార్థీవ దేహాన్ని నాయకులు, కార్యకర్తలు, ప్రజల సందర్శనార్థం జిల్లా కేంద్రంలోని సిపిఎం కార్యాలయంలో ఉంచారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆమె పోరాట పటిమను కొనియాడారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీష్‌రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, మాజీ మంత్రులు కుందూరు జానారెడ్డి, రాంరెడ్డి, దామోదర్‌రెడ్డి, సిపిఎం జాతీయ నాయకులు బివి రాఘవులు, సుభాషిణి అలీ, కేంద్ర కమిటి సభ్యులు చెరుపల్లి సీతారాములు, వీరయ్య, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తదితరులు ఆమె సేవలను గుర్తు చేసుకున్నారు. మల్లు స్వరాజ్యం సాయుధ పోరాటంలో ఆదిలాబాద్, వరంగల్ కరీంనగర్ జిల్లాలో నాడు దొరల దురహంకారాన్ని ఎదిరించి పాటల ద్వారా ప్రజల్ని చైతన్య పరిచారన్నారు.

రెండు దఫాలుగా ఎమ్మెల్యేగా ప్రజా సమస్యలపై స్వరాజ్యం గళమెత్తారని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మద్యపాన వ్యతిరేక పోరాటంలో మల్లు స్వరాజ్యం ముఖ్య పాత్ర పోషించారన్నారు. మహిళల పోరాటాలకు ఆమె మార్గదర్శకంగా నిలిచారన్నారు. పోరాటాలకు తెగించి పోరాడిన వీర వనిత స్వరాజ్యం అని పలువురు అభివర్ణించారు. రాబోయే కాలంలో ఆమె పోరాట స్ఫూర్తితో ప్రతిఒక్కరూ ముందుకు సాగాలన్నారు. అనంతరం పార్టీ కార్యాలయం నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య అంతిమ యాత్ర సాగింది. స్వరాజ్యం పార్థివదేహాన్ని పార్టీ నాయకులు, మంత్రి జగదీష్‌రెడ్డి, కుటుంబ సభ్యల సమక్షంలో ఐఎంఏ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ పుల్లారావు సమక్షంలో వైద్య కళాశాలకు అందజేశారు. కార్యక్రమంలో కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, వెంకట్, నంద్యాల నర్సింహారెడ్డి, మహిళా సంఘం జాతీయ ఉపాధ్యక్షురాలు జ్యోతి, ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘం అధ్యక్షులు రమాదేవి, సిఐటియు అఖిల భారత నాయకులు సాయిబాబా, శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, గాదరి కిషోర్‌కుమార్, చిరుమర్తి లింగ య్య, నోముల భగత్, మాజీ శాసన సభ్యులు కూసుకుం ట్ల ప్రభాకర్‌రెడ్డి, వేముల వీరేశం, బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్, గోలి మధుసూదన్‌రెడ్డి, బండా రు ప్రసాద్, కంకణాల నాగిరెడ్డి, సిపిఐ నాయకులు మల్లెపల్లి ఆదిరెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, కాంగ్రెస్ నాయకులు, నాయకులు కొండేటి మల్లయ్య, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి సిపిఎం జిల్లా కార్యదర్శులు ముదిరెడ్డి సుదాకర్‌రెడ్డి, మల్లు నాగార్జున రెడి,్డ జహంగీర్, నారి ఐలయ్య, తుమ్మల వీరారెడ్డి, బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, చిన్నపాక లక్ష్మినారాయణ, పాలడుగు ప్రభావతి, సయ్యద్ హాషం, పుచ్చకాయల నర్సిరెడ్డి, కొండమడుగు నర్సింహ, మాటూరి బాలరాజు, అనురాధ, ముల్కల పల్లి రాములు, నెమ్మాని వెంకటేశ్వర్లు, కున్‌రెడ్డి నాగిరెడ్డి, ఎండి సలీం, దండెంపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ, కుంభం కృష్ణారెడ్డి, యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సైదులు, మనె భిక్షం, నాయకులు శంకరయ్య తదితరులు నివాళులర్పించారు.

ఉద్యమకారులకు మల్లు స్వరాజ్యమే స్ఫూర్తి

ఎంఎల్‌సి కవిత
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం భౌతిక కాయానికి హైదరాబాద్‌లోని ఎంబి భవన్‌లో ఎంఎల్‌సి కవిత నివాళులు అర్పిం చారు వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. రెండో దశ తెలంగాణ ఉద్యమంలోనూ అనేక సందర్భాల్లో మల్లు స్వరాజ్యం నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నానని.. ఉద్యమకారులకు స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి ఆమె నని అన్నారు. మల్లు స్వరాజ్యం తెలం గాణలో తుపాకీ పట్టిన మొట్టమొదటి మహిళగా కీర్తి గడించి సమాజానికి స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అన్నారు. మల్లు స్వరాజ్యంను పట్టిస్తే 10 వేల రూపాయలు బహుమతి ఇస్తామని ఆనాడు ప్రకటించడమంటే ఎంత గొప పోరాటం చేశారో అర్థం అవుతోందన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News