Thursday, January 23, 2025

అభివృద్ధిలో మల్యాల భేష్

- Advertisement -
- Advertisement -

నారాయణరావుపేట: అభివృద్ధిలో మల్యాల గ్రామం భేష్ అని మహారాష్ట్ర సర్పంచుల బృందం ఖితాబునిచ్చారు. గురువారం నారాయణరావుపేట మండలం మల్యాల గ్రామాన్ని మహరాష్ట్ర సర్పంచుల బృందం సభ్యులు సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలోని గ్రామ పంచాయతీ, గ్రంథాలయం, విలేజ్ ఫంక్షన్ హాల్, లవ్ మల్యాల, పల్లెపకృతి వనం, సేంద్రియ ఎరువుల తయారీ కేంద్రం, స్మశాన వాటికి, చిల్డ్రన్స్ పార్కుతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను సందర్శించి అభివృద్ధి బాగుందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యులు పాల సాయిరాం, ఎంపిపి ఒగ్గు బాలకృష్ణ, ఎంపిడిఓ మురళీధర్ శర్మ, సర్పంచ్ వజ్రవ్వ, ఎంపిటిసి ఆకుల హరీశ్, పంచాయతీ కార్యదర్శి నరేష్,ఉప సర్పంచ్ శంకర్, వార్డు సభ్యులు అమర్ రెడ్డి, అజయ్ రెడ్డి, నాయకులు ఎల్లారెడ్డి, కాసం ఆంజిరెడ్డి, చంద్రం గౌడ్‌లు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News