Sunday, December 22, 2024

మెడికల్ కాలేజీతో నర్సంపేటకు మహర్ధశ వచ్చింది: కవిత

- Advertisement -
- Advertisement -

వరంగల్: నర్సంపేటలో మెడికల్ కాలేజీతో మహర్ధశ వచ్చిందని ఎంపి మాలోతు కవిత తెలిపారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో మెడికల్ కాలేజీ కోసం భూమిపూజ చేసిన సందర్భంగా మాలోతు కవిత మాట్లాడారు. మన గ్రామాలు, తండాల పిల్లలు వచ్చే సంవత్సరం నుంచి మెడికల్ విద్య చదువుతారని పేర్కొన్నారు. నర్సంపేటకు మెడికల్ కాలేజీ మంజూరు చేయడంతో సిఎం కెసిఆర్‌కు కవిత ధన్యవాదాలు తెలిపారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత సిఎంకెసిఆర్‌కే దక్కుతుందన్నారు. తెలంగాణలో అభివృద్ధిని చూసి కాంగ్రెస్ వాళ్లకు గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, ఎంపి మాలోత్ కవిత, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ లావణ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News