Monday, December 23, 2024

ఛాలెంజింగ్ రోల్‌లో…

- Advertisement -
- Advertisement -

సుధీర్ బాబు కథానాయకుడిగా హర్షవర్ధన్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై నారాయణదాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్న చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. సోనాలి నారంగ్, సృష్టి సెల్యులాయిడ్ సమర్పిస్తున్న ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోంది. సుధీర్ బాబు పుట్టినరోజును పురస్కరించుకొని మేకర్స్ బుధవారం సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘మామా మశ్చీంద్ర’ అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు. మశ్చీంద్ర అనే పదానికి .. పవర్‌ని కోరుకునేవాడు, ధైర్యవంతుడనే అర్ధాలు ఉన్నాయి. ఈ టైటిల్ సినిమాలో సుధీర్ బాబు పాత్రని ప్రతిబింబిస్తుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఒక రాక్ స్టార్‌లా ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నారు సుధీర్ బాబు. ఈ సినిమాలో ఆయన ఛాలెంజింగ్ రోల్ పోషిస్తున్నారు. వినూత్నమైన కాన్సెప్ట్‌తో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News