Friday, December 20, 2024

గందరగోళం మామ

- Advertisement -
- Advertisement -

నటుడు, రచయిత హర్షవర్ధన్ దర్శకుడిగా ‘మామ మశ్చీంద్ర’ అనే సినిమాతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సుధీర్ బాబు త్రిపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో ఈషా రెబ్బ, మృణాళిని రవి హీరోయిన్లుగా నటించారు.
సినిమా కథ…
పరశురాం (సుధీర్ బాబు) చిన్నతనంలోనే తన తల్లిని కోల్పోగా.. ఆస్తి కోసం తన తల్లిని ప్రాణం పోయేలా చేసిన తండ్రి.. అలాగే తనను మోసం చేసిన మేనమామ మీద పగ పెంచుకుంటాడు. తన తండ్రిని చంపి జైలుకు వెళ్లి తిరిగి వచ్చాక తన మేనమామ మీద పగ తీర్చుకోవడానికి అతడి ఇంట్లో పాగా వేస్తాడు. అతను కూతురిలా పెంచుకునే అమ్మాయిని పెళ్లాడతాడు. ఒక ఆడ బిడ్డకు జన్మనిచ్చాక పరశురాం భార్య చనిపోతుంది. ఆ బాధతో అతడి మేనమామ కూడా ప్రాణాలు వదులుతాడు. తన సవతి సోదరినే తన మేనమామ కొడుకు పెళ్లాడటంతో వాళ్లిద్దరూ, వారి పిల్లలు తన మీద పగతీర్చుకుంటారేమో అని పరశురాంలో భయం మొదలవుతుంది. వాళ్లందరినీ చంపడానికి ప్రయత్నించినా కుదరదు. ఈ భయంతోనే తన కూతురిని పెంచి పెద్ద చేస్తాడు పరశురాం. అతడి కూతురు పెరిగి పెద్దదై పరశురాం మేనల్లుడితోనే ప్రేమలో పడుతుంది. దీంతో తన కూతురు ఏమవుతుందో అన్న భయం పరశురాంలో ఇంకా పెరిగిపోతుంది. ఈ స్థితిలో అతనేం చేశాడు.. చివరికి ఈ కథ ఎలాంటి మలుపులు తిరిగింది అన్నదే ఈ సినిమా.

విశ్లేషణః సుధీర్ బాబు తన కెరీర్‌లోను సరిగ్గా నటించలేకపోయిన సినిమా ఇది. త్రిపాత్రాభినయం చేసిన ఈ కథానాయకుడు ఏ పాత్రకు కూడా పూర్తి న్యాయం చేయలేకపోయాడు. ముసలి పాత్ర అయిన పరశురామ్ పాత్రకి అతను అస్సలు సరిపోలేదు. ఇక ఊబకాయంగా వేసిన రౌడీ దుర్గ పాత్ర కూడా సెట్ కాలేదు. యంగ్‌గా కనిపించిన డీజే పాత్రలో సరైన నటనతో ఆకట్టుకోలేకపోయాడు. నటుడిగా, రచయితగా మెప్పించిన హర్షవర్ధన్ దర్శకుడిగా ‘మామ మశ్చీంద్ర’ సినిమా కథని తెర మీద సరిగ్గా చూపించలేకపోయాడు. సినిమా ప్రారంభం నుంచి ప్రేక్షకుడిని కథలో లీనం చేయలేకపోయాడు. ప్రారంభ సన్నివేశం నుంచి ఈ సినిమా కథలో గందరగోళం, ఆసక్తికరంగా లేకపోవడంతో ప్రేక్షకుడు నిరాశ చెందక తప్పదు. దర్శకుడు ఏమి చెప్పాలనుకున్నాడో తెలియక కథ ఎటువైపో వెళ్తూ ఉంటుంది. చివరికి ప్రేక్షకుడికి ఎప్పుడు సినిమా ముగుస్తుందా అనిపిస్తుంది. సినిమాలోని ఏ సన్నివేశంలో కూడా వినోదం, భావోద్వేగం సరిగ్గా లేకపోవడం గమనార్హం. హీరోహీరోయిన్ల మధ్య సన్నివేశాలు కూడా ప్రేక్షకులను నిరాశపరుస్తాయి. చివరికి ఇదొక గందరగోళం సినిమాగా ప్రేక్షకులను నిరాశపరిచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News