Monday, January 20, 2025

అమ్మకి సంబందించిన కథ… తండ్రికూతుళ్ళ కథ

- Advertisement -
- Advertisement -

నైట్రో స్టార్ సుధీర్ బాబు యాక్టర్ -ఫిల్మ్ మేకర్ హర్షవర్ధన్ దర్శకత్వంలో చేస్తున్న యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘మామా మశ్చీంద్ర’. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పిపై నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్‌తో పాజిటివ్ బజ్‌ని క్రియేట్ చేసింది. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ ద్విభాషా చిత్రాన్ని సృష్టి సెల్యులాయిడ్ సోనాలి నారంగ్, సృష్టి సమర్పిస్తున్నారు. శుక్రవారం సినిమా విడుదవుతున్న నేపధ్యంలో మేకర్స్ ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హీరోలు శర్వానంద్, విశ్వక్ సేన్, శ్రీవిష్ణు, డైరెక్టర్ శేఖర్ కమ్ముల ముఖ్య అతిధులుగా పాల్గొన్న ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది.

ప్రీరిలీజ్ ఈవెంట్‌లో హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ “ఈ సినిమాలో ఈషా చాలా చక్కగా నటించింది. తనకి ,దుర్గాకి మధ్య వచ్చే సీన్స్ చాలా ఆసక్తికరంగా వుంటాయి. మిర్నాళిని రవి, నాకు మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు ఖుషి సినిమాని గుర్తు చేస్తాయి. దర్శకుడు హర్ష ఇందులో ఓ కీలక పాత్ర చేశారు. తన ఆలోచనలు చాలా డిఫరెంట్‌గా వుంటాయి. ఇందులో చాలా సర్‌ప్రైజ్‌లు వుంటాయి. ప్రతి పది నిమిషాలకు ఒక మలుపు వస్తుంది. మామ మశ్చీంద్ర సినిమా చూస్తున్నప్పుడు ఒత్తిళ్ళు అన్నీ మరిచిపోతారు. సినిమా మహేష్ బాబులా పరిగెడుతుంది”అని అన్నారు. దర్శకుడు హర్షవర్ధన్ మాట్లాడుతూ “గుండెజారే, మనం సినిమాలలాంటి మ్యాజిక్ వున్న కథ ఇది.

మంచి ప్రేమకథ వుంటుంది. అనుబంధాలు వున్నాయి. ఇది ఒక అమ్మకి సంబందించిన కథ. తండ్రికూతుళ్ళ కథ. చాలా చక్కని ఎమోషన్స్ వున్నాయి. మనం సినిమాలలానే ఈ సినిమాని ఆదరిస్తారనే నమ్మకం వుంది. ఈషా రెబ్బా, మృణాలిని చాలా అద్భుతంగా చేశారు. సుధీర్ బాబు లేకపోతే ఇది సాధ్యపాడేది కాదు. ఇది ఫ్యాన్స్ కోరుకునే సినిమా అవుతుందనే నమ్మకం వుంది”అని పేర్కొన్నారు. నిర్మాత పుస్కూర్ రామ్ మోహన్ మాట్లాడుతూ “సుధీర్ బాబు చాలా హార్డ్ వర్క్ చేస్తారు. మూడు గెటప్స్‌లో చాలా కష్టపడ్డారు. మేకప్ వేసుకోవడానికి రెండేసి గంటలు పట్టేది. అవుట్ ఫుట్ చూసిన తర్వాత చాలా ఆనందంగా అనిపించింది. సినిమా చాలా బాగా వచ్చింది. హర్ష రాసిన మనం, గుండెజారి చిత్రాలు ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం కూడా ఖచ్చితంగా అలరిస్తుంది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈశా రెబ్బా, మిర్నాళిని రవి,అశోక్ గల్లా, రామ్ అబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News