Sunday, September 8, 2024

నీతి ఆయోగ్ సమావేశం నుంచి మమతా బెనర్జీ వాకౌట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ:  ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో నీతి ఆయోగ్ సమావేశం మొదలయింది. అయితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  ప్రసంగించడానికి తగినంత సమయాన్ని కేటాయించకపోవడానికి, సరైన వైఖరి పాటించనందున  నిరసనగా ఆమె ఆ సమావేశం నుంచి వాకౌట్ చేశారు.

‘‘ చంద్రబాబు నాయుడుకు మాట్లాడటానికి 20 నిమిషాలు కేటాయించారు. ఇంకా అస్సాం, గోవా ముఖ్యమంత్రులు మాట్లాడటానికి 10 నుంచి 12 నిమిషాలు ఇచ్చారు. కానీ నేను ఐదు నిమిషాలు మాట్లాడక ముందే నన్ను నిలువరించారు. అందుకనే నేను ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాను’’ అని మమతా బెనర్ఝీ వివరించారు.

ప్రధాని మోడీ నేతృత్వంలో నేడు రాష్ట్రపతి భవన్ లో నీతి ఆయోగ్ సమావేశం జరుగుతోంది.  అయితే కేంద్రానికి, ప్రతిపక్ష పాలిత రాష్టాల మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది. కేంద్రం ఏకపక్ష కేటాయింపులు చేసిందంటూ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించారు.  ఇండియా కూటమికి చెందిన నలుగురు ముఖ్యమంత్రులు ఈ సమావేశాన్ని బహిష్కరించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా ఈ సమవావేశానికి హాజరు కాలేదు.  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్, కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్  సింగ్ సూఖు, కేరళ ముఖ్యమంతిర పినరయి విజయన్ వంటి మహామహులు అంతా ఈ నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించారు.

2047 నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా చేయాలన్న లక్ష్యంతో నేటి నీతి ఆయోగ్ సమావేశం నిర్వహిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News