Wednesday, January 22, 2025

హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళతాం: మమతా బెనర్జీ

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో 2010 నుంచి జారీ చేసిన ఓబిసి సర్టిఫికెట్లన్నిటినీ రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేయనున్నట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం ప్రకటించారు. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని సాగర్ వద్ద ఒక ఎన్నికల ప్రచార సభలో ఆమె ప్రసంగిస్తూ వేసవి సెలవుల తర్వాత ఉన్నత న్యాయస్థానంలో హైకోర్టు తీర్పును సవాలు చేస్తున్నట్లు తెలిపారు.

ఓబిసి సర్టిఫికెట్లను రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పును తాము ఆమోదింంచబోమని ఆమె తెలిపారు. లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న వేళ 2010 నుంచి జారీచేసిన ఓబిసి సర్టిఫికెట్లన్నిటినీ రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పు రాజకీయ దుమారాన్ని రేపింది. బిజెపికి కాని మరే ఇతర పార్టీకి కాని ఒక్క ఓటు కూడా వేయవద్దని మమతా బెనర్జీ ఓటర్లకు పిలుపునిచ్చారు. టిఎంకిని గెలిపిస్తే కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని ఆమె చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News