- Advertisement -
కోల్‌కతా : డబ్బులు తీసుకుని లోక్‌సభలో ప్రశ్నలు లేవనెత్తారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా వివాదంపై పార్టీ అధినేత్రి , బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎట్టకేలకు మౌనం వీడారు. లోక్‌సభ నుంచి మహువాను బహిష్కరించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు , లోక్‌సభ ఎన్నికల ముందు ఆమెకు సహాయ పడతాయని మమత వ్యాఖ్యానించారు.
కోల్‌కతా లోని స్టేడియంలో పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె ఈ విధంగా మొదటిసారి స్పందించారు. “ పార్లమెంట్ నుంచి మహువాను బహిష్కరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీని కారణంగా ఆమె చాలా పాప్యులర్ అవుతారు. పార్లమెంట్‌లో ఏదైతే ఆమె చెప్పాలనుకున్నారో ఇప్పుడు బయట చెబుతారు.ఎవరైనా ఎన్నికల ముందు మూడు నెలల్లో ఇలా ఏదో చేయడం తెలివిలేనితనం కాక మరేమిటి ? ” అని మమత వ్యాఖ్యానించారు.
- Advertisement -