న్యూఢిల్లీ: దేశ రాజ్యాంగాన్ని, రాజ్యాంగం ప్రజలకు కల్పించిన రక్షించాలని ముర్మును బెంగాల్ సిఎం మమతా బెనర్జీ విపత్కర పరిస్థితుల నుంచి దేశాన్ని కాపాడాలని రాష్ట్రపతికి ఆమె విన్నవించారు. పౌర సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్మును గోల్డెన్ లేడీగా మమతా ప్రశంసించారు. విభిన్న మతాలు, కులాలు, జాతులు తరతరాలుగా సమైక్యంగా జీవిస్తున్న వారసత్వానికి దేశం గర్విస్తుందన్నారు. రాష్ట్రపతి మేడమ్ మీరు ఈ దేశానికి అధినేత. మీరు రాజ్యాంగాన్ని, పేదలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను రక్షించాలని విన్నవిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విగ్రహాన్ని, గిరిజన వాయిద్య డ్రమ్మును రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మమతా బెనర్జీ బహూకరించారు.
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, ప్రజలు ఘనస్వాగతం పలికినందుకు రాష్ట్రపతి కృతజ్ఞతలు తెలుపుతూ బెంగాల్ ప్రజలు సంస్కారవంతులు, ప్రగతిశీలురుగా పేర్కొన్నారు. బెంగాల్ భూమి ఒకవైపు అమర విప్లవకారులును మరోవైపు ప్రముఖ శాస్త్రవేత్తలకు జన్మనిచ్చిందన్నారు. రాజకీయాల నుంచి న్యాయవవస్థ, సైన్స్, తత్వశాస్త్రం, ఆధ్యాత్మికత, క్రీడలు, వ్యాపారం, సాహిత్యం, సినిమా, నాటకం, చిత్రకళ తదితర రంగాల మార్గదర్శకులు బెంగాల్‌లో జన్మించారన్నారు. బెంగాల్ ప్రజలు ఎల్లప్పుడూ న్యాయం, సమానత్వం, ఆత్మగౌరవం, ఆదర్శాలకు ప్రాధాన్యత ఇస్తారని ముర్ము తెలిపారు.
బ్రిటిష్ అధికారాన్ని, జమిందారీ వ్యవస్థను తొలగించడానికి తిరుగుబాటుకు నాయకత్వం వహించిన నాయకుల జ్ఞాపకార్థం ఓ వీధికి సిడో కన్హు దహర్ అని పేరు పెట్టడం తనకు సంతోషం కలిగించిందని రాష్ట్రపతి తెలిపారు. కాగా రాష్ట్రపతి పౌర సన్మాన కార్యక్రమానికి ప్రతిపక్ష బిజెపికి చేందిన ఒక్క నేత కూడా హాజరుకాలేదు.