Sunday, January 19, 2025

బిజెపి నేతల హెలికాప్టర్లపై దాడి చేసే దమ్ముందా?

- Advertisement -
- Advertisement -

కూచ్‌బిహార్: ఆదాయం పన్ను శాఖ(ఐటి) అధికారులకు దమ్ముంటే బిజెపి నాయకులు ఉపయోగిస్తున్న హెలికాప్టర్లో తనిఖీలు చేయాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం సవాలు చేశారు. తమ పార్టీ ఎంపి అభిషేక్ బెనర్జీ ఉపయోగిస్తున్న హెలికాప్టర్‌పై ఐటి అధికారులు ఆదివారం దాడి చేశారని టిఎంసి ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ అధినేత్రి తాజాగా ఐటి అధికారులకు సవాలు విసరడం విశేషం. పశ్చిమ బెంగాల్‌లోని కూచ్ బిహార్‌లో సోమవారం ఒక ఎన్నికల ప్రచార సభలో మమత ప్రసంగిస్తూ లోక్‌సభ ఎన్నికల ముందు టిఎంసికి వ్యతిరేకంగా కేంద్ర దర్యాప్తు సంస్థలను బిజెపి దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు.

అభిషేక్ బెనర్జీ ఉపయోగిస్తున్న హెలికాప్టర్ ట్రయల్ రన్‌కు ముందు ఐటి అధికారులు దాడి జరిపి అందులో సోదాలు నిర్వహించి ఏమీ పట్టుకోలేకపోయారని ఆమె తెలిపారు. హెలికాప్టర్‌లో డబ్బు, బంగారం ఉన్నట్లు తమకు సమాచారం అందినట్లు ఐటి అధికారులు చెప్పారని, కాని వారికి ఏమీ దొరకలేదని ఆమె చెప్పారు. అటువంటి చర్యలకు తాము పాల్పడబోమని ఆమె స్పష్టం చేశారు. అటువంటి పనులకు పల్పడేది బిజెపియేనని ఆమె ఆరోపించారు. బిజెపి నాయకుల హెలికాప్టర్లపై దాడులు జరిపి సోదాలు చేసే దమ్ము ఐటి అధికారులకు ఉందా అంటూ ఆమె సవాలు విసిరారు. తొలి దశ ఎన్నికలకు ముందు తమ పార్టీ నాయకులను ఎన్‌ఐఎ అరెస్టు చేసే అవకాశం ఉందని, తమ నాయకులను అరెస్టు చేయించి ఎన్నికలను తమ ఇష్టం వచ్చిన రీతిలో జరుపుకోవానల్నదే బిజెపి ఆలోచన అంటూ ఆమె ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News