Monday, January 20, 2025

‘ఇండియా’ను ఎదుర్కొనే ధైర్యం ఎన్‌డిఎకు ఉందా?: మమత

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బిజెపిని ఓడించడమే ఏకైక లక్ష్యంగా నిర్వహించిన ప్రతిపక్షాల సమావేశం మంగళవారం ముగిసింది. బెంగళూరు వేదికగా రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ సమావేశంలో మొత్తం 26 పార్టీల నేతలు పాల్గొన్నారు. సమావేశం అనంతరం విపక్ష నేతలంతా సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ… ‘ఇండియా’ కూటమిని ఎదుర్కొనే ధైర్యం బిజెపి, ఎన్‌డిఎకు ఉందా? అని మమతా బెనర్జీ సవాలు విసిరారు.

వివిధ రాష్ట్రప్రభుత్వాలను బిజెపి ప్రభుత్వం వేధిస్తోందన్నారు. రాష్ట్రప్రభుత్వాలను కూల్చడంపైనే బిజెపి దృష్టిపెట్టిందన్నారు. దేశ ప్జల జీవితాలు ప్రమాదంలో పడ్డాయన్నారు.‘ ఈ విపత్తునుంచి దేశాన్ని దేశ ప్రజలను కాపాడుకోవలసిన అవసరం ఉంది. కేంద్ర దర్యాప్తు సంస్థలను స్వతంత్రంగా పని చేయనివ్వడం లేదు. విమర్శిస్తే విపక్షాలపై వాటిని ఎక్కుపెడుతున్నారు. భారత్ గెలుస్తుంది.. బిజెపి ఓడుతుంది’ అని మమత అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News