Monday, December 23, 2024

పేదలకు ఒరిగేదేమీ లేదు: కేంద్ర బడ్జెట్‌పై ప్రతిపక్షాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 202324 శవార్షిక బడ్జెట్‌పై ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు పెదవి విరిచారు. ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్‌గా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీ అభివర్ణించారు. ఇది పూర్తి అవకాశవాదంతో రూపొందించిందని, 2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే రూపొందించిన బడ్జెట్ అంటూ ఆమె విమర్శించారు. బడ్జెట్‌లో తీసుకువచ్చిన కొత్త ఆదాయం పన్ను స్లాబ్‌ల వల్ల ప్రజలకు ఒరిగేది ఏమీ ఉండదని, దేశంలో నిరుద్యోగ సమస్య గురించి బడ్జెట్‌లో ప్రస్తావనే లేదని ఆమె విమర్శించారు.

కాగా..బడ్జెట్‌లో ప్రతిపాదించిన పన్ను కోతలను మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి చిదంబరం స్వాగతించారు. పన్ను కోతలు ఏవి జరిగినా తాను స్వాగతిస్తానని, దీని వల్ల ప్రజల చేతుల్లో మరింత డబ్బు ఆడుతుందని, ఇది ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని ఆయన అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో కొన్ని మంచి అంశాలు ఉన్నప్పటికీ గ్రామీణ పేదలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్య వంటి సమస్యల ప్రస్తావనే లేదని, కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు జవాబు ఇంకా రాలేదని మరో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపి శశి థరూర్ అన్నారు.

జమ్మూ కశ్మీరు మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి కేంద్ర బడ్జెట్‌పై విమర్శలు గుప్పించారు. గత 8, 9 సంవత్సరాలుగా కేంద్ర బడ్జెట్‌లో ఎటువంటి మార్పు లేదని ఆమె అన్నారు. పన్నులు పెంచడం, సంక్షేమ పథకాలకు, సబ్సిడీలకు డబ్బు ఖర్చు పెట్టటకపోవడం బడ్జెట్‌లో సర్వసాధారణమైపోయిందని ఆమె అన్నారు.

బిఎస్‌పి అధినేత్రి, యుపి మాజీ ముఖ్యమంత్రి మాయావతి సైతం బడ్జెట్‌పై పెదవి విరిచారు. బడ్జెట్ అన్నది దేశం కోసం ఉండాలే పట్ట పార్టీ కోసం కాదని ఆమె ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తాము చేపడుతున్న పథకాల లబ్ధిదారుల గురించి మట్లాడిన ప్రతిసారి 130 కోట్ల మంది పేదలు, కార్మికులు, అణగారినవర్గాలు, రైతులతో కూడిది ఈ సువిశాల భారతదేశం అని గుర్తుంచుకోవాలని, మంచి రోజుల కోసం ప్రజలు ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారని మాయావతి వ్యాఖ్యానించారు.
ఇలా ఎండగా,,కేంద్ర వార్షిక బడ్జెట్ ఆశకు బదులుగా నిరాశను మిగిల్చిందని సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు, యుపి మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించారు. ఈ బడ్జెట్ కారణంగా దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం మరింత పెరుగుతాయని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News