Monday, December 23, 2024

హేమంత్ సోరెన్ అరెస్టుపై మమత ఖండన

- Advertisement -
- Advertisement -

కోల్‌కత: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్టును పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం ఖండించారు. హేమంత్ సోరెన్‌ను శక్తివంతమైన గిరిజన నాయకుడిగా ఆమె అభివర్ణించారు. సోరెన్‌కు తనకు సన్నిహిత మిత్రుడని ఆమె తెలిపారు. శక్తివంతమైన గిరిజన నాయకుడైన హేమంత్ సోరెన్ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ పోస్టులో ఆమె తెలిపారు.

ప్రజా ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు బిజెపి అండదండలతో పనిచేస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థలు పన్నిన కుట్రగా సోరెన్ అరెస్టును ఆమె అభివర్ణించారు. తన సన్నిహిత మిత్రుడైన హేమంవ సోరెన్‌కు తాను అండగా నలిబడతానని, ఈ సంక్లిష్ట సమయంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు తాను అంకితమవుతానని ఆమె తెలిపారు. బిజెపి కక్షసాధింపు చర్యలపై ఆగ్రహంతో ఉన్న జార్ఖండ్ ప్రజలు బలమైన జవాబు ఇస్తారని, ఈ కీలక పోరాటంలో విజయం సాధిస్తారని ఆమె ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News