కోల్‌కతా: కాలి గాయంతో ఆస్పత్రిలో చేరిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ శుక్రవారం సాయంత్రం ఆస్పత్రినుంచి డిశ్చార్జ్జ్ అయ్యారు. మరో 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి ఉన్నప్పటికీ.. ఆమె అభ్యర్థన మేరకు తగిన వైద్య సలహాలతో డిశ్చార్జ్జ్ చేసినట్లు వైద్యులు తెలిపారు. రెండు రోజుల చికిత్స అనంతరం మమత ఆస్పత్రినుంచి వీల్‌చైర్‌లో బైటికి వచ్చారు. ఆమె పరిస్థితి చాలా వరకు మెరుగైందని, ఆస్పత్రినుంచి డిశ్చార్జి చేయాలని పదేపదే కోరడంతో డిశ్చార్జి చేశామని, కొన్ని పరిమితులతో ఆమె నడవవచ్చని, మరో వారం రోజుల లోపల మరోసారి ఆమె చెకప్ కోసం ఆస్పత్రికి రావలసిన అవసరం ఉంటుందని ఓ వైద్యుడు చెప్పారు. ఆస్పత్రి వద్ద మమత మేనల్లుడు, పార్టీ ఎంపి అభిషేక్ బెనర్జీ, రాష్ట్ర మంత్రి ఫిర్హాద్ హకీమ్, ఇతర పార్టీ నేతలు వేచి ఉండడంతో వారి సాయంతో ఆమె ఇంటికి వెళ్లారు.
ఆస్పత్రినుంచి దీదీ డిశ్చార్జ్
- Advertisement -
- Advertisement -
- Advertisement -