Monday, December 23, 2024

సంహిత పేరిట క్రూర చట్టాలు.. కేంద్రంపై మమత బెనర్జీ నిరసన

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా : దేశంలోని దేశద్రోహ చట్టం నిబంధనల ఎత్తివేత సాకుతో కేంద్రం మరింతగా నిర్బంధకాండకు దిగుతోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆరోపించారు. కేంద్ర ప్రతిపాదిత భారతీయ న్యాయ సంహిత చట్టం ప్రతిపాదనలు మరింత ఏకపక్షంగా, నిరంకుశ చర్యలకు తార్కారణంగా ఉన్నాయని , కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఇందుకు రంగం సిద్ధం చేసిందని మమత మండిపడ్డారు. అమిత్ షా, ప్రధాని మోడీలు చెప్పేదొకటి చేసేదొకటి అని విమర్శించారు. దేశంలోని అత్యంత కీలకమైన ఐపిసి, సిఆర్‌పిసి, భారతీయ సాక్షాల చట్టం వంటివాటికి బదులుగా క్రమేపీ కేంద్రం నుంచి అత్యంత క్రూరమైన ,

పౌరులకు ఇరకాటపు చట్టాలు నిబంధనలు వస్తున్నాయని తెలిపారు. ఇందుకు ఉన్నతస్థాయిలో కసరత్తు చేస్తున్నారని విమర్శించారు. పేరుకు తియ్యగా ఉండేలా భారతీయ న్యాయసంహిత చట్టం తెస్తున్నారని, ఇది పౌరుల వ్యతిరేక చర్య అని హెచ్చరించారు. ఐపిసి , నేరశిక్షాస్మృతిలకు మారుగా ఇప్పుడు రూపొందించిన చట్టం ముసాయిదాలను తాను చదివినట్లు వివరించారు. చాలా నిరంకుశమైన చట్టాలకు పదును పెడుతున్నారని తెలిసి తాను దిగ్బ్రాంతి చెందినట్లు మమత సామాజిక మాధ్యమంలో స్పందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News