Monday, December 23, 2024

కేంద్రంపై మమత మండిపాటు

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా : కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వంపై బెంగాల్ సిఎం మమతాబెనర్జీ మండిపడ్డారు. స్కూల్ టీచర్ల రిక్రూట్‌మెంట్ స్కామ్ విచారణ కోసం కోల్‌కతా సీబీఐ కార్యాలయానికి తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీ హాజరైన నేపథ్యంలో మమత ఈ ఆరోపణలు చేశారు. కేంద్రం లోని నిరంకుశ ప్రభుత్వ ఏజెన్సీ పాలన… మా పనిని సవాల్‌గా మార్చిందంటూ ట్వీట్ చేశారు.

34 ఏళ్ల రాక్షస పాలనను మార్చి పశ్చిమబెంగాల్‌లో “మా, మతి, మనుష్, ( తల్లి, భూమి, ప్రజలు) ప్రభుత్వాన్ని ప్రారంభిస్తామని 2011 లో ఈ రోజున ప్రమాణం చేశానని మమతాబెనర్జీ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈరోజు మనం చేసిన ప్రతిజ్ఞను పునరుద్ఘాటిస్తున్నామని , ప్రజల కోసం మనల్ని మనం పునరంకితం చేసుకుంటున్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News