Monday, December 23, 2024

మమతా బెనర్జీ తలకు తీవ్రగాయం

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గాయపడ్డారు. ఆమె ఇంటి ఆవరణంలో కిందపడడంతో ఎస్‌ఎస్‌కెఎం ఆస్పత్రికి తరలించారు. ఆమె నుదుటిపై గాయమైందని పార్టీ వర్గాలు ఎక్స్‌లో ట్విట్ చేశాయి. సిఎం మమతా బెనర్జీ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ, ఎఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. పూర్తిగా ఆరోగ్యంతో త్వరగా తిరిగి రావాలని ప్రార్థించారు. గత జనవరిలో కారు ప్రమాదంలో మమతా గాయపడిన విషయం తెలిసిందే. బర్ధమాన్ నుంచి కోల్‌కతాకు తిరిగి వస్తుండగా ఆమె కాన్వాయ్ ఎదురుగా ఉన్న మరో వాహనం రావడంతో తప్పించుకునే క్రమంలో డ్రైవర్ బ్రేకులు వేశాడు. ఈ క్రమంలో ముందు సీట్లో కూర్చున్న ఆమె విండ్‌షీల్డ్‌కు తగిలి గాయపడ్డారు. ఆమె అప్పుడు స్వల్ప గాయాలతోనే బయటపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News