Thursday, January 23, 2025

కాంగ్రెస్‌కు 40 సీట్లు కూడా అనుమానమే: మమత బెనర్జీ

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌లో ఒంటరి పోరుకు సిద్ధమన్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీపైతీవ్రస్థాయిలో మండిపడ్డారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 40 సీట్లు దక్కడం కూడా అనుమానమేనని అన్నారు. కాంగ్రెస్‌పై పశ్చిమ బెంగాల్ సిఎం విమర్శలతో విపక్ష ఇండియా కూటమిలో లుకలుకలు మరింత ముదిరేలా కనిపిస్తున్నాయి.బెంగాల్‌లోని ముర్షీదాబాద్‌లో శుక్రవారం జరిగిన సభలోఆమె మాట్లాడారు.‘ 300 సీట్లలో మీరు(కాంగ్రెస్)కనీసం 40 సీట్లయినా గెలుస్తారనేది అనుమానమే. అలాంటిది మీకెందుకంత అహంకారం’ అని దీదీ నిలదీశారు.

భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ బెంగాల్‌లో అడుగుపెట్టినా తనకు సమాచారం ఇవ్వలేదని, ప్రభుత్వ యంత్రాంగంనుంచి తనకు సమాచారం తెలిసిందని ఆమె వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్, యుపిలలో గెలిచే పరిస్థితి లేదని, వారణాసి, లహాబాద్‌లలో గెలిచి మమీ సత్తా చూపించాలని కాంగ్రెస్‌కు సవాలు విసిరారు. రాహుల్ గాంధీ బీడీ కార్మికులతో ఫోటో దిగడాన్ని ప్రస్తావిస్తూ , ఒక్కసారి కూడా టీ దుకాణానికి వెళ్లని వాళ్లు ఇప్పుడు బీడీ కార్మికులతో కూర్చుంటున్నారని మమతా బెనర్జీ ఎద్దేవా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News