కోల్‌కతా: బీర్భూమ్ హింస వెనుక పెద్ద హస్తమే ఉందని, రాష్ట్రంలో రాజకీయ హింస, చట్టవ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహిస్తోందని ముఖ్యమంత్రి మమతాబెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీర్భూమ్ ప్రాంతంలో మమతాబెనర్జీ గురువారం పర్యటించారు. ”ఆధునిక బెంగాల్‌లో ఇంత అనాగరికం జరుగుతుందని నేను అనుకోలేదు. తల్లులు, పిల్లలు చనిపోయారు. మీ కుటుంబీకులు చనిపోయారు. నా గుండె తరుక్కుపోతోందంటూ మమత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ హింస వెనుక పెద్ద కుట్ర ఉందని, బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ఆమె పోలీసులను అక్కడికక్కడే ఆదేశించారు. పోలీసులు అన్ని కోణాల్లో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుపుతారని, బాధితకుటుంబాలకు ఆమె హామీ ఇచ్చారు. అలాగే ఫిర్యాదును స్వీకరించడంలో ఆలస్యం చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. నిందితులు పారిపోయారు, దొరకడం లేదని కుంటి సాకులు చెప్పొద్దని పోలీసులను హెచ్చరించారు. సాక్షులకు అవసరమైన భద్రత కల్పించండి. ఇళ్లు పూర్తిగా దగ్ధమైపోయిన వారికి, బాగు చేసుకునే నిమిత్తం రెండు లక్షల రూపాయలు ఇస్తాం. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా ఇస్తాం” అని మమత పేర్కొన్నారు.
Mamata Banerjee key comments on Birbhum Violence