Saturday, November 23, 2024

కేంద్రం పెత్తనంపై విపక్ష సంఘటిత ప్రతిఘటన

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా : దొడ్డిదారి ఆర్డినెన్స్‌ల ద్వారా రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి, ఢిల్లీ సిఎం , ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం కేంద్రం అణచివేత ధోరణి ఇకపై మరిన్ని ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలలో కూడా సాగుతుందని, దీనిని పరిగణనలోకి తీసుకుని ప్రతిపక్షాలు సంఘటితంగా వ్యవహరించాల్సి ఉందని మమత బెనర్జీ పిలుపు నిచ్చారు. ఢిల్లీలో అధికారుల నియామకాలు, బదిలీల అధికారాన్ని ఆప్ సారథ్యపు ఢిల్లీ ప్రభుత్వానికి కట్టబెడుతూ ఇటీవలే సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అయితే దీనిని కాదనే రీతిలో కేంద్ర ప్రభుత్వం తన విశేషాధికారాలతో నియామకాల అంశంపై ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. దీనితో కేంద్రం ఆప్ ప్రభుత్వం మధ్య వివాదం రగులుకున్న దశలో ఇతర ప్రతిపక్షాల మద్దతు కూడగట్టుకునే యత్నాలలో భాగంగా కేజ్రీవాల్ మంగళవారం కోల్‌కతాకు వచ్చారు. మమత అధికారిక నివాసంలో కేజ్రీవాల్ మంగళవారం పలు గంటల పాటు రహస్య చర్చలు జరిపారు.

ఆయన వెంట పంజాబ్ సిఎం భగవంత్ మాన్, ఆప్ నేతలు రాఘవ చద్ధా, అతీషి సింగ్ ఉన్నారు. ఢిల్లీలో ఇప్పుడు జరిగిన దానిపై తాను ఎక్కువగా ఏమి చెప్పదల్చుకోలేదని, ఢిల్లీలో ఇప్పుడు జరిగింది ఇకపై ఎప్పుడైనా ఇతర ప్రతిపక్ష ప్రభుత్వాల రాష్ట్రాలలో జరుగుతుందని చెప్పడానికే వచ్చానని కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీ బ్యూరోక్రట్ల సర్వీసు సంబంధిత ఆర్డినెన్స్ రాజ్యసభలో వీగిపొయ్యేలా ప్రతిపక్షం చేయగలిగితే ఇది ప్రతిపక్ష విజయానికి , ప్రత్యేకించి వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల ముందు ప్రతిపక్ష ఐక్యతకు నిదర్శనం అవుతుందని, సెమీఫైనల్‌గా మారుతుందని కేజ్రీవాల్ తెలిపారు. మమత ఇతర ప్రతిపక్ష నేతల మద్దతు అవసరం అన్నారు. ఇది కేవలం ఢిల్లీకి సంబంధించిన విషయమే కాదు, బెంగాల్‌లో, పంజాబ్‌లో కూడా ఇటువంటి చర్యలతో కేంద్రం పెత్తనాలకు దారి తీస్తోందని , తమిళనాడు సిఎం స్టాలిన్ కూడా గవర్నర్ పలు బిల్లులను తొక్కిపెడుతున్నారని వాపోయ్యారని సమావేశం తరువాత కేజ్రీవాల్ విలేకరులకు తెలిపారు. నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీసెస్ అథార్టీ ఏర్పాటుకు వీలు కల్పించే ఆర్డినెన్స్ ద్వారా రాష్ట్రాల నియామకాలలో కేంద్రం జోక్యం చేసుకుంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News