Sunday, April 13, 2025

మమత బెనర్జీ యుకె పర్యటనకు కేంద్రం సమ్మతి

- Advertisement -
- Advertisement -

ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఒక ఉపన్యాసం ఇవ్వడానికి ఈ నెల మూడవ వారంలో లండన్‌కు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతిపాదిత పర్యటనను కేంద్రం బుధవారం ఆమోదించిందని రాష్ట్ర సచివాలయం నబన్నలో ఒక ప్రతినిధి వెల్లడించారు. మమతా బెనర్జీ ఈ నెల 21న లండన్‌కు బయలుదేరవలసి ఉందని, ఆమె 27న ఉపన్యాసం ఇవ్వవలసి ఉందని ఆ ప్రతినిధి తెలియజేశారు. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రొ వైస్ చాన్స్‌లర్ జోనాథన్ మిచీ 2023 నవంబర్‌లో బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ కోసం కోల్‌కతాలో ఉన్నప్పుడు మమతను ఆహ్వానించారు. లండన్‌కు మమత విమానం 21న దుబాయి మీదుగా వెళ్లనున్నది. కాగా, మమతా బెనర్జీ యుకెను సందర్శించడం ఇది రెండవ సారి. 2017 నవంబర్‌లో ఆమె ఎడిన్‌బరోలో ఆసియా స్కాట్లాండ్ ఇన్‌స్టిట్యూట్, ఎడింబరో వాణిజ్య మండలి మద్దతుతో స్కాటిష్ డెవలప్‌మెంట్ ఇంటర్నేషనల్ నిర్వహించిన వాణిజ్య సమావేశానికి ఆమె హాజరయ్యారు. మమత 29న కోల్‌కతాకు తిరిగిరావలసి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News