- Advertisement -
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీని మర్యాదపూర్వకంగా కలిశానని బెంగాల్ సిఎం మమతా బెనర్జీ తెలిపారు. ప్రధాని మోడీతో బెంగాల్ సిఎం భేటీ ముగిసింది. మమత మూడోసారి సిఎం అయ్యాక ప్రధానితో తొలిసారి సమావేశమయ్యారు. రాష్ట్రానికి కోవిడ్ టీకాలు, ఔషధాలు పెంచాలని ఈ సమావేశంలో కోరినట్టు తెలిపారు. పశ్చిమబెంగాల్ పేరు మార్పు అంశాన్ని ప్రస్తావించినట్టు వివరించారు. విజ్ఞప్తులను పరిశీలిస్తానని ప్రధాని అన్నారని మమత బెనర్జీ తెలిపారు. పెగాసస్ పై ప్రధాని అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పారు. పెగాసస్ పై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలన్నారు. విపక్షాల ఐక్య కూటమి సహజంగానే ఏర్పడుతుందని చెప్పారు.
- Advertisement -