Saturday, November 23, 2024

పెండింగ్ కేంద్ర నిధులను వెంటనే ఇవ్వండి: మమత బెనర్జీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ప్రధాని నరేంద్ర మోడీని ఇక్కడ కలిశారు. రాష్ట్రానికి పెండింగ్ ఉన్న కేంద్ర నిధులను వెంటనే విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్ర, కేంద్ర అధికారులు కూర్చుని సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రధాని ప్రతిపాదించినట్లు ఆమె తెలిపారు. తమ పార్టీకి చెందిన 9 మంది ఎంపీలతో కలసి పార్లమెంట్ కాంప్లెక్స్‌లో ప్రధానితో సమావేశమైన అనంతరం టిఎంసి అధినేత్రి మీడియాతో మాట్లాడారు.

ఇప్పటికే 155 కేంద్ర బృందాలు పశ్చిమ బెంగాల్‌ను సందర్శించాయని, కేంద్ర లేవనెత్తిన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చిందని ఆమె తెలిపారు. రాష్ట్రానికి రావలసిన ఉపాధి హామీ పథకం నిధుల గురించి మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం కూలీలకు చెల్లింపులు జరపడం తప్పనిసరని చెప్పారు. 2022-23 బడ్జెట్‌లో 100 రోజుల పని కింద ఒక్క పైసా రాష్ట్రానికి ఇవ్వలేదని ఆమె ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News