Tuesday, April 8, 2025

మహాకుంభ మేళా మృత్యు కుంభమేళాగా మారింది: మమతా బెనర్జీ

- Advertisement -
- Advertisement -

మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాట సంఘటనల్లో చాలా మంది మరణించారని, మరణించిన వారి సంఖ్యను సరిగా చూపెట్టడంలేదని, మహాకుంభ్ కాస్త మృత్యుకుంభమేళాగా మారిందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం విమర్శించారు. గత నెల ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన తొక్కిసలాటలో 30 మంది చనిపోగా, 60 మందికి గాయాలయ్యాయని, ఇటీవల న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ వద్ద రద్దీ కారణంగా 18 మంది మరణించారని ఆమె తెలిపారు. ‘మహాకుంభ్ కాస్తా మృత్యు కుంభమేళాగా మారింది. మరణసంఖ్యను తగ్గించి చూపేందుకు వారు(బిజెపి ప్రభుత్వం) వందలాది భౌతిక కాయాలను దాపెట్టింది’ అని మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రసంగిస్తూ తెలిపారు.

ఆమె బిజెపి ఎంఎల్‌ఏలపై విరుచుకుపడుతూ ‘నన్ను ఎదుర్కొనడానికి బిజెపి ఎంఎల్‌ఏలు భయపడుతున్నారు. అందుకే నేను ప్రసంగించేప్పుడు వారు సభను బాయ్‌కాట్ చేసి వెళ్లిపోతున్నారు’ అని తెలిపారు. తనను ముస్లిం లీగ్‌తో లింక్ చేయడాన్ని కూడా ఆమె ఖండించారు. ‘నేను లౌకికవాదాన్ని, సహజీవనాన్ని నమ్ముతాను, అన్ని సముదాయాల వారు అభివృద్ధి చెందాలని కోరుకుంటాను’ అన్నారు. బంగ్లాదేశీ తీవ్రవాదులతో తనకు సంబంధాలున్నాయన్న ఆరోపణను కూడా మమతా బెనర్జీ ఖండించారు. ‘ఒకవేళ బిజెపి కనుక దానిని రుజువుచేస్తే నేను వెంటనే రాజీనామా చేస్తాను’ అన్నారు. ‘బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడినప్పటికీ పశ్చిమ బెంగాల్‌లో శాంతి, సామరస్యాలు నెలకొని ఉండడానికి కారణం తమ ప్రభుత్వ విధానమే’ అని ఆమె వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News