- Advertisement -
విచారణ ఈ నెల 24కు వాయిదా
కోల్‌కత: నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గంలో గెలుపొందిన ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి ఎన్నికను సవాలు చేస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను కలకత్తా హైకోర్టు శుక్రవారం ఈ నెల 24కు వాయిదావేసింది. ఈ రోజు విచారణకు రానున్న కేసుల జాబితాలో ఈ పిటిషన్ కూడా ఉండడంతో ఈ విషయాన్ని న్యాయమూర్తి కౌశిక్ చందా దృష్టికి మమతా బెనర్జీ తరఫు న్యాయవాది తీసుకువచ్చారు. ఎన్నికల పిటిషన్‌పై విచారణ జరిగే మొదటి రోజున పిటిషనర్ మమతా బెనర్జీ కూడా కోర్టులో హాజరు కావలసి ఉంటుందని జస్టిస్ చందా న్యాయవాదికి తెలియచేశారు. కోర్టు నిబంధనల ప్రకారం తాము నడుచుకుంటామని న్యాయవాది తెలియచేయడంతో కేసు విచారణను వచ్చే గురువారానికి(జున్ 24)కు న్యాయమూర్తి వాయిదా వేశారు.
Mamata Banerjee petition on Suvendu election
- Advertisement -