Monday, December 23, 2024

టిఎంసి చీఫ్‌గా తిరిగి ఎన్నికైన మమతా బెనర్జీ

- Advertisement -
- Advertisement -

Mamata Banerjee re-elected as TMC chairperson

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం టిఎంసి చైర్‌పర్సన్‌గా తిరిగి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆమె బిజెపికి వ్యతిరేకంగా ఐక్యమత్యంతో పోరాడాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. “నా పార్టీ నాయకులు, కార్యకర్తలు తమలో తాము కీచులాడుకోకుండా ఉంటామని వాగ్దానం చేయాలని కోరుకుంటున్నాను. అంతర్గత పోరును సహించేదిలేదు…పార్టీలో గ్రూపిజంను కూడా సహించేదిలేదు. టిఎంసిలో వివిధ గ్రూపులు లేవు. పార్టీ యావత్ ఒకే గ్రూపుగా ఉంది” అన్నారు. “బెంగాల్‌లో జరుగనున్న తదుపరి ఎన్నికల్లో మొత్తం 42 లోక్‌సభ సీట్లను గెలుచుకునేందుకు పార్టీ పోరాడనుంది. అందరినీ మేము కలుపుకుపోనున్నాం” అంటూ ఆమె టిఎంసి చైర్‌పర్సన్‌గా తిరిగి ఎన్నికైన సందర్భంగా తెలిపారు. టిఎంసి 1998లో ఏర్పాటయినప్పటి నుంచి ‘పోరాటం’కి పర్యాయపదంగా ఉందని నొక్కి చెప్పారు.

మమతా బెనర్జీని తప్పించి వేరే ఎవరినీ తన నాయకుడిగా ఆమోదించబోనని టిఎంసి ప్రముఖుడు, ఎంపి కళ్యాణ్ బెనర్జీ ఈ సందర్భంగా చెప్పారు. కొవిడ్19ని నియంత్రించేందుకు కొన్ని సలహాలు ఇచ్చిన టిఎంసి జాతీయ కార్యదర్శి అభిషేక్ బెనర్జీని కూడా ఆయన విమర్శించారు. అభిషేక్ బెనర్జీ స్వయాన మమతా బెనర్జీ మేనల్లుడు. ఆయన డైమండ్ హార్బర్ నుంచి లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. అభిషేక్ బెనర్జీ పార్టీలో రెండో నాయకుడుగా అనధికారికంగా చెలామణి అవుతున్నాడని, ఈ విషయం కొంత మంది సీనియర్ నాయకులకు మింగుడుపడ్డలేదన్నారు. పార్టీలో అభిషేక్ బెనర్జీ స్థాయి పెరిగిపోతుండడం వల్ల, తక్కువ భావనకు గురైన సువేందు అధికారి బిజెపిలో చేరారు. ఆయన ప్రస్తుతం అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News