Monday, December 23, 2024

బీజేపీ వ్యతిరేక కూటమికి కాంగ్రెస్‌తో కలిసేందుకు మమత సిద్ధం : పవార్

- Advertisement -
- Advertisement -

Mamata Banerjee ready to ally with Congress

ముంబై : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోడానికి విపక్షాలు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. అయితే ఇప్పటికే ప్రతిపక్షాల ఐక్యత ఓ రూపు దాల్చలేదు. కాంగ్రెస్‌తో కలిస్తేనే బీజేపీని ఓడించగలమనే విశ్వాసం కొన్ని పార్టీలదైతే.. కాంగ్రెస్ లేకుండా ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేయాలనేది మరికొందరి భావన. మమతాబెనర్జీ రెండో అభిప్రాయంతో ఉన్నారని చాలా మంది భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్సీపీ అధినేత , రాజకీయ కురువృద్ధుడు, శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌తో కలిసి ఏర్పాటు చేయబోయే కూటమికి కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడానికి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి సుముఖంగానే ఉన్నారని చెప్పారు. దేశ ప్రయోజనాల దృష్టా ఆ పార్టీతో విభేదాలను పక్కన పెట్టాలని ఆమె నిర్ణయించుకున్నారని ఇక్కడ విలేకరుల సమావేశంలో చెప్పారు.

బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో కలిపి ఏర్పాటు చేయబోయే కూటమిలో చేరేందుకు బీహార్ సీఎం నితీశ్ కుమార్ , జమ్ముకశ్మీర్ మాజీ సిఎం ఫరూక్ అబ్దుల్లా సుముఖంగానే ఉన్నారని శరద్ పవార్ తెలిపారు. అదే సమయంలో మమతాబెనర్జీ గురించి విలేకరులు ప్రశ్నించగా, మమత సైతం కలిసొచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. జాతి ప్రయోజనాల దృష్టా విభేదాలు పక్కన పెట్టనున్నట్టు తనతో వ్యక్తిగతంగా ఆమె చెప్పారని శరద్ పవార్ పేర్కొన్నారు. పశ్చిమబెంగాల్ ఎన్నికల నాటి సంఘటనలను విస్మరించాలని ఆమె అనుకుంటున్నారని తెలిపారు. పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ సీట్లు రావడానికి కాంగ్రెస్ , సీపీఎం నేతృత్వం లోని కూటమి ఉపయోగపడిందని మమత భావిస్తున్నారు. అవేవీ పట్టించుకోకూడదని మమత అనుకుంటున్నారని పవార్ తెలిపారు. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ను కలుపుకొని వెళ్లేందుకు చాలా పార్టీలు సుముఖంగా ఉన్నాయని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News