Saturday, January 25, 2025

బయటివారితో బీజేపీ విధ్వంస కాండ: మమతా బెనర్జీ

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: బయటివారిని రాష్ట్రానికి రప్పించి బీజేపీ విధ్వంసాలను చేయిస్తోందని, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ఆరోపించారు. ఈ దాడుల్లో భాగంగానే ఉత్తర్ దినాజ్‌పూర్ జిల్లాలోని కలియగంజ్ పోలీస్ స్టేషన్ ను, ప్రైవేట్ ఆస్తులను దగ్ధం చేయడం వంటి విధ్వంస కాండలు జరిగాయని, మైనర్ బాలిక మరణానికి దారి తీశాయని ఆమె తీవ్రంగా మండిపడ్డారు. ఈ విధ్వంసంతో ప్రమేయం ఉన్న వారి ఆస్తులను పోలీసులు స్వాధీనం చేసుకోవాలని ఆదేశించినట్టు పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు. అధికారులతో సమావేశం జరిగిన తరువాత సెక్రటేరియట్‌లో పాత్రికేయుల సమావేశం నిర్వమించారు.

బెంగాల్‌లో బీజేపీ దౌర్జన్యాలకు పాల్పడుతోందని, రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తున్నారని ఈ కుట్రను తాము ఎదుర్కొంటామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను అస్థిరపర్చడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పాత మాల్డా జిల్లాలో ఒక స్కూలులోకి ఆగంతకుడు తుపాకీతో చొరబడగా, ఆ బందీ సంక్షోభాన్ని తప్పించి, నిందితుడ్ని నిరాయుధునిగా చేసిన పోలీస్‌ల ప్రయత్నాలను ముఖ్యమంత్రి బెనర్జీ అభినందించారు. ఈ చర్య ఉన్మాదంతో కాదని ఆమె పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News