కోల్‌కతా: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్ర భుత్వానికి వ్యతిరేకంగా బిజెపియేతర పక్షా ల గొంతుకలన్నీ ఏకమవుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ బిజె పి ముక్త్ భారత్‌కు పిలుపునిచ్చారు. ఆయన బాటలోనే ఇటీవల బీహార్ సిఎం నితీశ్ కు మార్ నడుస్తున్నారు. ఇటీవల ఆయన ఢిల్లీ పర్యటనలో పలువురు విపక్ష నాయకులతో భేటీ అయ్యారు. అంతా ఏకతాటిపైకి వచ్చి 2014 సాధారణ ఎన్నికల్లో మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించాల్సిన ఆవశ్యకతపై ఆయా నేతలతో చర్చలు కూడా జరిపారు. తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కూడా కేం ద్రంపై గర్జించారు. అసలు ఆట పశ్చిమబెంగాల్ నుంచే మొదలవుతుందని.. తాను నితీశ్, అఖిలేశ్ , హేమంత్ సొరేన్‌తో పాటు ఇతర మిత్రులంతా చేతులు కలుపుతామన్నారు. ఇక బిజెపి వచ్చేసారి ఎలా ప్రభు త్వం ఏర్పాటు చేస్తుందని మమత ప్రశ్నించారు. కోల్‌కతాలో గురువారం జరిగిన తృణమూల్ సభలో ఆమె మాట్లాడారు. జార్ఖండ్‌లో హేమంత్ సర్కార్‌ను కూల్చేందుకు కుట్ర పన్నారని, అందులో భాగంగా ఇద్దరు జార్ఖండ్ ఎంఎల్‌ఎలు పశ్చిమ బెంగాల్‌లో కోట్లాది రూపాయాలతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారని, ఆ డబ్బుతో శాసనసభ్యులను కొనుగోలు చేసి హేమంత్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూశారని ఆక్షేపించారు. ఆ కుట్రను తమ ప్రభుత్వం భగ్నం చేసిందన్నారు. బెంగాల్‌లో వరుసగా మూడుసార్లు బిజెపిని మట్టికరిపించి అధికారాన్ని టిఎంసి చేజిక్కించుకుందని మమత అన్నారు. ఈడీ, సిబిఐలతో ఎవరినైనా లొంగదీసుకోవచ్చునని కేంద్రంలోని బిజెపి తలుస్తోందన్నారు. విచారణ సంస్థలతో భయపెట్టాలని భావిస్తున్నారు. బంగ్లాదేశ్ ప్రధాని హసీనా భారత్ వచ్చినా కోల్‌కతా రాకుండా బిజెపి అడ్డుకుందని మమత ఆరోపించారు. నేతాజీ విగ్రహావిష్కరణకు ఢిల్లీ రావాలని ఒక జానియర్ స్థాయి అధికారితో లేఖ పంపారని, అదీ బుధవారంనాడు రాత్రి ఏడు గంటలకు రాశి గురువారం ఆరు గంటల కల్లా అక్కడుండాలి అని హుకుం జారీ చేశారని అన్నారు. తానేమీ బిజెపికి బానిసను కాదని మమత మండిపడ్డారు. అందుకే నేతాజీ విగ్రహావిష్కరణకు హాజరవడంల లేదన్నారు. కేంద్ర సాంస్కృతిక మంత్రి ఏం చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయం అంటేనే యుద్ధ్దరంగమని, తాము 34 ఏళ్లుగా పోరాడుతున్నామని పేర్కొన్నారు. రాజకీయ పార్టీల్లో విభేదాలను మీడియా గోరంతను కొండంతలుగా చూపుతోందని ఆరోపించారు. గతంలో తనకు అభిషేక్ బెనర్జీ మధ్య విభేదాలున్నాయని చూపారని, ఇలాంటి పెరగదని ఆమె హితవు పలికారు. పశువుల స్మగ్లింగ్ కేసులో టిఎంసీ నేత అసుబ్రత మొండల్ అరెస్టును ప్రస్తావిసూ అసుబ్రత మొండల్ సాహసిగా జైలు నుంచి తిరిగి వస్తారని అన్నారు. బడా నేతలను అరెస్టు చేస్తే కార్యకర్తలు నిస్పృహకు లోనవుతారని వారనుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ గతం లోనే తన కుమార్తె కవిత, సీనియర్ నేత కే. కేశవరావుతో కలిసి కోల్‌కతా వెళ్లి మరీ మమతతో సమావేశమయ్యారు. విపక్షాల ఐక్య పోరు ప్రాధాన్యతను, బీజేపీయేతర పక్షాలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన ఆవశ్యకతను వివరించారు. దానికి నాడు మమత సానుకూలంగానే స్పందించారు. ఇప్పుడు నితీశ్ కూడా రంగం లోకి దిగడంతో ఆమె తన వైఖరిని పూర్తిగా వెల్లడించారు.
Mamata Banerjee slams BJP Govt