Monday, December 23, 2024

బెంగాల్‌లోకి బిజెపి కిరాయి గూండాలు: మమత బెనర్జీ

- Advertisement -
- Advertisement -

బెంగాల్‌లోకి బిజెపి కిరాయి గూండాలు
బీహార్ నుంచి బుల్‌డోజర్లతో రప్పించారు
హౌరా, హుగ్లీ భగ్గుమనడం వెనుక కుట్ర
టిఎంసి అధినేత్రి మమత బెనర్జీ విమర్శలు
కోల్‌కతా: బెంగాల్ భగ్గుమనేలా చేసేందుకు బిజెపి కిరాయి గూండాలను రంగంలోకి దింపుతోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ విమర్శించారు. శ్రీరామ నవవి శోభాయాత్రల దశలో హుగ్లీ, హౌరాలలో విధ్వంసం చెలరేగడం , రాష్ట్ర గవర్నర్ ప్రత్యేకంగా ప్రత్యక్షంగా పరిస్థితిని సమీక్షించుకోవడం వంటి పరిణామాల నేపథ్యంలో మమత మంగళవారం దీనిపై మాట్లాడారు. ఈస్ట్ మిడ్నాపూర్‌లో పార్టీ కార్యకర్తలను ఉద్ధేశించి ఆమె మాట్లాడారు. ‘ఇక్కడ శాంతి విచ్ఛిన్నం కావాలని కేంద్రం తాపత్రయంగా కన్పిస్తోంది. దీనికోసం బిజెపి గూండాలు రంగంలోకి దిగుతున్నారు.

దండిగా కిరాయి గూండాలను మేపుతూ బిజెపి వారిని సున్నిత విషయాల దశలో వీధుల్లోకి పంపించడం కేవలం ఘర్షణలు, హింసాకాండ రెచ్చగొట్టేలా చేయడం’ అని మమత మండిపడ్డారు. ఇప్పుడు పార్టీ కార్యకర్తలు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. కిరాయి మూకలు అల్లర్లు చెలరేగేలా వ్యవహరిస్తే వెంటనే వారిని నిలదీయాలి. వారిని ప్రత్యక్షంగా అక్కడికక్కడే పట్టుకుంటే నిజాలు జనం వద్దకు వెళ్లుతాయని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. బెంగాళీలు శాంతిప్రియులు, వారికి ఘర్షణలు నచ్చవనే విషయం ఈ విధ్వంసకారులకు తెలియదన్నారు. తాము, ఇక్కడి సామాన్యులు విధ్వంసాలను ఇష్టపడరని తెలిపారు. బిజెపి చాలా తెలివిగా వ్యవహరిస్తుంది. ఏదో విధంగా ఇక్కడ శాంతి భద్రతల సమస్య చిత్రీకరించాలని చూస్తోంది.

తాము నేరుగా వారు రంగంలోకి దిగరు. ఇందుకు వారు ఘర్షణలను రెచ్చగొట్టేందుకు కిరాయికి జనాన్ని కుదుర్చుకుంటారని ఇప్పుడు జరుగుతున్నది ఇదే అన్నారు. వీరిని బీహార్ నుంచి డబ్బులు ఇచ్చి రప్పిస్తున్నారని, వారు ఏకంగా అక్కడి నుంచి బుల్‌డోజర్లను తీసుకుని వస్తున్నారని ఆరోపించారు. బిజెపి గూండాలు కొందరు హౌరాలో సైరవిహారానికి దిగారని, ట్రాక్టర్లు, బుల్‌డోజర్లతో వచ్చినవీరు ఇక్కడ గన్‌లతో బెదిరిస్తూ పలు ఇళ్లను ధ్వంసం చేశారని విమర్శించారు. ప్రదర్శనకు అనుమతి లేకుండానే ముందుకు సాగడం, వీరు హౌరా నుంచి ఆ తరువాత రిష్రాకు విధ్వంసకాండకు సాగడం జరిగిందని తెలిపారు. హింసాకాండకు పాల్పడుతున్న వారికి ఎటువంటి మతం లేదని సిఎం మమత బెనర్జీ పేర్కొన్నారు. వీరు హిందువులు కాదు, ముస్లింలు కాదని, వీరంతా కేవలం బిజెపి గూండాలని స్పష్టం చేశారు. తరాలుగా బెంగాల్‌లో హిందూ ఉత్సవాలు ఆనవాయితీగా శాంతియుతంగా సాగుతున్నాయి, ఎక్కడా విధ్వంసాలు, గూండాల ప్రవేశం జరిగింది లేదని తెలిపారు.

రాముడి పేరును దెబ్బతీస్తున్న బిజెపి
ఓ వైపు రాముడి పేరిట ఓట్లు అడిగే బిజెపి మరో వైపు తన చర్యలతో రాముడి పేరుకు మచ్చతెస్తోందని మమత విమర్శించారు. రామనవమి వేళలో హింసాకాండ చెలరేగేలా చేయడం ఏం సంస్కారం? ఇటువంటి చర్యలకు పాల్పడటంతో బిజెపి హిందూ మతాన్ని కించపరుస్తోందని అన్నారు. ఒక వర్గాన్ని మరో వర్గంతో తలపడేలా చేసేందుకు బిజెపి యత్నిస్తోంది. బీహార్‌లో రామ నవమి ఉత్సవాల దశలో ఘర్షణలు చెలరేగిన విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల ప్రస్తావించిన విషయాన్ని మమత ఇప్పుడు గుర్తు చేశారు. బిజెపిబీహార్‌లో అధికారంలోకి వస్తే విధ్వంసకారులను రోడ్డుపై వేలాడదీస్తామని అమిత్ షా చెప్పారు. మరి ఇక్కడ (బెంగాల్‌లో) బిజెపి గుండాల విషయంలో ఆయన ఏం చేస్తారని మమత ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News