Wednesday, November 6, 2024

విపక్ష నాయకులే బిజెపి ప్రధాన టార్గెట్: మమతా బెనర్జీ

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: ప్రధాని మోడీ నవభారతంలో ప్రతిపక్షాలకు చెందిన నాయకులే బిజెపికి ప్రధాన టార్గెట్‌గా మారిపోయారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ విమర్శించారు. కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్ష నేపథ్యంలో ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ పార్లమంట్ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

దీనిపై మమతా బెనర్జీ స్పందిస్తూ నేర చరిత్రగలిగిన బిజెపి నాయకులను కేంద్ర క్యాబినెట్‌లో చేర్చుకున్నారని, కాని ప్రతిపక్ష నాయకులను మాత్రం వారి ఉపన్యాసాలకే పార్లమంట్ సభ్యత్వాలను రద్దు చేస్తారని వ్యాఖ్యానించారు. మన రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజాస్వామిక విలువలు నేడు అట్టడుగు స్థాయికి పడిపోయిన వైనాన్ని కళ్లారా చూస్తున్నామని మమత ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ ఎంపి కెసి వేణుగోపాల్ స్పందిస్తూ అదానీ అంశాన్ని రాహుల్ లేవనెత్తిన రోజు నుంచే ఆయన గొంతును అణచివేయడానికి బిజెపి భావిస్తోందని విమర్శించారు. రాహుల్ మాట్లాడడానికి అనుమతించకపోవడం బిజెపి ప్రభుత్వ అప్రజాస్వామిక, నియంతృత్వ వైఖరికి తార్కాణమని ఆయన ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News