Sunday, December 22, 2024

42మంది జాబితాతో కాంగ్రెస్‌కు మమత చురక

- Advertisement -
- Advertisement -

ఎంపి సీట్ల సర్దుబాట్లపై టిఎంసితో ఇప్పటికీ చర్చల ప్రక్రియ సాగుతోందని కాంగ్రెస్ చెపుతున్న దశలోనే మమత టిఎంసి జాబితాను వెలువరించింది. మొత్తం 42 స్థానాలకు టిఎంసి అభ్యర్థులను ప్రకటించేసింది. జాతీయ స్థాయిలో బిజెపిని ఎదుర్కొనేందుకు కలిసికట్టుగా ప్రతిపక్షాల వేదిక ఇండియా వ్యవహరించాలనే సంకల్పానికి ఈ పరిణామం చిక్కుముళ్లకు దారితీసింది. ప్రత్యేకించి ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, టిఎంసిల నడుమ బెంగాల్‌లో ఇక సీట్ల సర్దుబాట్ల ప్రక్రియ నిలిచిపోయినట్లే అయింది. ఒంటరిపోరే తమ వైఖరి అని, మొత్తం 42 స్థానాలకు పోటీ చేస్తున్నామని మమత స్పష్టం చేశారు.

కాగా ఏ పార్టీతో అయినా తాము గౌరవప్రద రీతిలో సీట్ల సర్దుబాటుకు దిగుతామని ఇప్పటి పరిణామాలపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ స్పందించారు. ఇక లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి మమత బెనర్జీ వైఖరి సంకుచితంగా ఉందని విమర్శించారు. ఈ జాబితాతో మమత నేరుగా పిఎంఒకు ఓ సానుకూల సందేశం వెలువరించిందన్నారు. ఇండియా కూటమిలో ఉండటం వల్ల మోడీ నుంచి చిక్కులు వస్తాయనే భయం ఆమెను పట్టుకుందని, ఇక ఏ రాజకీయ పార్టీ కూడా మమత వంటి నమ్మకద్రోహ నేతను నమ్మే పరిస్థితి లేదని మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News