Sunday, December 22, 2024

నేర చట్టాల అమలును వాయిదా వేయండి: మమతా బెనర్జీ

- Advertisement -
- Advertisement -

హడావుడిగా ఆమోదించిన మూడు నేర చట్టాల అమలును వాయిదా వేయాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. జులై 1వ తేదీ నుంచి అమలులోకి రాట్మూడు నేర చట్టాలను వాయిదా వేయాలని ఆమె ప్రధానికి రాసిన ఒక లేఖలో కోరారు. ఈ చట్టాలపై పార్లమెంట్‌లో మళ్లీ తాజాగా సమీక్షించాలని ఆమె కోరారు. భారతీయ న్యాయ సంహిత(బిఎన్‌ఎస్), భారతీయ సాక్ష అధినియం(బిఎస్‌ఎస్‌ఎ), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత పేరిట ఆమోదించిన మూడు నేర చట్టాల అమలు పట్ల ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ చట్టాలను పరిశీలించిన పార్లమెంటరీ స్తాయీ సంఘం సభ్యుడైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పి చిదంబరంను గురువారం కలుసుకున్న మమతా బెనర్జీ ఈ చట్టాలపై చర్చించినట్లు టిఎంసి వర్గాలు తెలిపాయి. ఈ నేర బిల్లులపై రూపొందించిన నివేదికలపై చిదంబరంతోపాటు టిఎంసి ఎంపీ డెరెక్ ఓబ్రియన్, డిఎంకె ఎంపి ఎన్‌ఆర్ ఎలంగో తమ అభ్యంతరాలను లిఖితపూర్వకంగా తెలిపారు. పార్లమెంట్ నుంచి 146 మంది ఎంపీలను సస్పెండ్ చేసిన సమయంలో ఈ మూడు నేర చట్టాలను ఆమోదించారని ప్రధానికి రాసిన లేఖలో మమత పేర్కొన్నారు. ఏకపక్షంగా ఎటువంటి చర్చ లేకుండా ఈ బిల్లులను మీ ప్రభుత్వం ఆమోదించిందని ఆమె పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News