Monday, November 18, 2024

ప్రగతిశీల శక్తులన్నీ ఏకం కావాలి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్‌కు పశ్చిమబెంగాల్ సిఎం మమతాబెనర్జీ శనివారం లేఖ రాశారు. జూన్ 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు న్యూఢిల్లీలోని కాన్టిట్యూషన్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి రావాలని ఆమె సిఎం కెసిఆర్‌ను ఆహ్వానించారు. రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ప్రగతిశీల శక్తులన్నీ ఏకం కావాలని మమతాబెనర్జీ పిలుపునిస్తూ 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా 22 మంది జాతీయస్థాయి నాయకులకు మమతాబెనర్జీ లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రపతి ఎన్నికల దృష్టా విపక్షాలను బెంగాల్ సిఎం కూడగడుతున్న నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికల్లో బలమైన ప్రతర్థిని బరిలో నిలిపేందుకు మమత తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఈనెల 15వ తేదీన నిర్వహించే భేటీకి సిఎంలు సహా 22 మంది జాతీయస్థాయి నేతలకు మమత ఆహ్వానం పంపారు. తెలంగాణ, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, జార్ఝండ్, ఒడిశా, పంజాబ్ సిఎంలతో పాటు పలువురు ప్రముఖులకు మమతా లేఖలు రాశారు.
మమతా బెనర్జీ లేఖలోని అంశాలు
1.బలమైన ప్రజాస్వామ్య స్వభావం కలిగిన దేశానికి సమర్థవంతమైన ప్రతిపక్షం అవసరం.
2. ఈ దేశంలోని ప్రగతిశీల శక్తులన్నీ ఏకమై నేడు మనల్ని పీడిస్తున్న విభజన శక్తులను ప్రతిఘటించాలి.
3.ప్రతిపక్ష నేతలను వివిధ కేంద్ర సంస్థలు ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుంటున్నాయి.
4.అంతర్జాతీయంగా దేశం ప్రతిష్టను కించపరచడంతో పాటు అంతర్గత తీవ్ర విభేదాలు సృష్టించబడ్డాయి.
5.మన ప్రతిఘటనను మరింత బలోపేతం చేసుకునే సమయం వచ్చింది.
6.రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తున్నాయి.. అన్ని ప్రగతిశీల ప్రతిపక్ష పార్టీలు తిరిగి సమావేశమై భారత రాజకీయాల భవిష్యత్ గమనంపై చర్చించేందుకు సరైన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. ఎన్నికలు స్మారక చిహ్నం, మన ప్రజాస్వామ్యానికి సంరక్షకుడిగా ఉంటుందని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు.

Mamata Banerjee writes letter to CM KCR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News