Sunday, November 17, 2024

బిజెపియేతర నేతలకు దీదీ లేఖలు

- Advertisement -
- Advertisement -

Mamata Banerjee writes letter to Opposition leaders

బెంగాల్: బిజెపియేతర నేతలకు బెంగాల్ సిఎం మమతా బెనర్జీ లేఖలు రాశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, ఎపి సిఎం జగన్, ఎన్ సిపి చీఫ్ శరద్ పవార్, ఢిల్లీ సిఎం కేజ్రీవాల్, డిఎంకె చీఫ్ స్టాలిన్, మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్ థాకరేతో సహా పలువురు నేతలకు మమత లేఖలు రాశారు. ప్రజస్వామ్యం, ఫెడరల్ విధానానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని మమత తన లేఖల్లో పేర్కొన్నారు.  ఢిల్లీ ప్రభుత్వ అధికారాల కుదింపు సహా పలు వివాదాస్పద అంశాలను ఆమె తన లేఖల్లో ప్రస్తావించారు. బిజెపికి వ్యతిరేకంగా అందరూ ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందని మమత ఈ లేఖల్లో పేర్కొన్నారు. భవిష్యత్ కార్యాచరణ రూపకల్పనకు ముందుకు రావాలని ఆమె వారిని కోరారు. బెంగాల్ ఎన్నికల తర్వాత భవిష్యత్ కార్యాచరణకు తాము సిద్ధంగా ఉన్నట్టు మమత వెల్లడించారు.

Mamata Banerjee writes letter to Opposition leaders

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News