Sunday, January 19, 2025

హెలికాప్టర్లో పడిపోయి మళ్లీ గాయపడ్డ మమతా బెనర్జీ

- Advertisement -
- Advertisement -

కోల్ కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  శనివారం దుర్గాపూర్ లో  హెలికాప్టర్లో పడిపోయింది. ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. ఆమె భద్రతా సిబ్బంది ఆమెను సకాలంలో కాపాడారు.  ఆ తర్వాత ఆమె మళ్లీ అసనోల్ కు తన పయనాన్ని కొనసాగించారు. ఆమె ఎన్నికల ర్యాలీకై కుల్టీ వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. తర్వాత ఆమె కుల్టీకి వెళ్లి ర్యాలీలో ప్రసంగించారు. అక్కడ టిఎంసి అసన్ సోల్ అభ్యర్థి శత్రుఘ్న సిన్హా కు మద్దతుగా ప్రచారం చేశారు. ఆమె గాయపడ్డం ఆరు వారాల్లో ఇది రెండో సారి. ఇదివరలో మార్చి 14 ఆమె తన ఇంట్లో పడిపోయి గాయపడ్డారు.

‘‘ ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో కూర్చోబోయే ముందు బ్యాలెన్స్ తప్పి పడ్డారు. ఆమె ప్రస్తుతం బాగానే ఉన్నారు’’ అని ఆమెతో పాటు వెళుతున్న సీనియర్ అధికారి ఓ వార్తా సంస్థకు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News