- Advertisement -
కోల్‌కత: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రైలు ప్రమాదంపై వెంటనే విచారణ,జరిపించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం డిమాండ్ చేశారు. ఇటువంటి రైలు ప్రమాదాలు దురదృష్టకరమని, ఇవి వరుసగా జరగడం విచారకరమని ఆమె పేర్కొన్నారు.
విజయనగరం జిల్లాలోని హౌరా-చెన్నై మార్గంలో కంటకపల్లి వద్ద ఆదివారం రాత్రి రాయగడ పాసింజర్ రైలును పలాస పాసింజర్ రైలును ఢీకొనడంతో మూడు బోగీలు పట్టాలు తప్పి 14 మంది మరణించగా దాదాపు 50 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
రైళ్లు కొనడం, బోగీలు పట్టాలు తప్పడం, నిస్సహాయ ప్రయాణికులు బోగీలలో ఇరుక్కుని ఆ తర్వాత మరణించడం సర్వసాధారణంగా మారిపోయిందని ఎక్స్ వేదికగా మమత వ్యాఖ్యానించారు. బాధిత కుటుంబాలకు ఆమె సానుభూతి ప్రకటించారు. వెంటనే ఈ ఘటనపై విచారణ చేపట్టాలని, నిద్రావస్థ నుంచి రైల్వేలు ఎప్పుడు మేల్కొంటాయంటూ ఆమె ప్రశ్నించారు.
- Advertisement -